హైదరాబాద్
మాజీ ఐఏఎస్ అధికారి రమేష్ కుమార్ తల్లిదండ్రుల ఇంటికి ఏపి పోలీసులు వచ్చారు. ముగ్గురు పోలీసుల బృందం కొండాపూర్ లోని రమేష్ తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటికి వచ్చి ఓ కేసులో భాగంగా విచారణకు రావాలని నోటీసులు అందచేసారు. రమేష్ కుమార్ తల్లిదండ్రులు వయసు 80 ఏళ్ల పైనే. ఈ నెల 22 న పటమట విచారణ కు హాజరు కావాలని నోటీసులు అందచేసారు. 2018 లో రమేష్ కుమార్ సోదరుడికి పై సెక్షన్ 498 ఏ, డోమెస్టిక్ వయలెన్స్, యాక్ట్ కింద కేసు నమోదు అయింది. ఆ కేసులో భాగంగా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఏపి సీఐడీ విభాగానికి చెందిన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రమేష్ కుమార్ తలిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ కుమారులను సునీల్ కుమార్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారి మండిపడుతున్నారు.