YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జగ్గారెడ్డి ఎత్తులు.. రేవంత్ పై ఎత్తులుఁ

జగ్గారెడ్డి ఎత్తులు.. రేవంత్ పై ఎత్తులుఁ

హైదరాబాద్, జనవరి 20,
కాంగ్రెస్ పార్టీలో ముఠా తగాదాలు,అంతర్గత కుమ్ములాటలు మామూలు వ్యవహరం. చేతికి ఉన్న ఐదేళ్లు ఎలా అయితే, సమానంగా ఉండవో, అదేవిధంగా హస్తం పార్టీలో అందరూ ఒకే మాట మీద ఉండరు. తెలంగాణలో అయితే, ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగానే శ్రుతిమించి రాగాన పడింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన దగ్గర నుంచి, సీనియర్ నాయకులు చిర్రుబుర్రులాడుతూనే ఉన్నారు.చాప కింద నీరులా అసమ్మతి సెగ రాజేస్తునే ఉన్నారు. అయితే, చిత్రంగా గత పక్షం రోజులకు పైగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి మధ్య మీడియా వేదికగా సాగిన యుద్ధం టీ కప్పులో తుపానులా సమసి పోయింది. కనీసం అలాంటి భ్రమలు అయితే బాగానే వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పెద్దలను గౌరవించడం లేదని, ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆరోపిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జగ్గా రెడ్డి లేఖ రాశారు. అంతే కాకుండా, రేవంత్ రెడ్డిని తమ దారికి అయినా తీసుకు రావాలి లేదంటే ఆయన్ని తీసేసి అందరినీ కలుపుకుపోయే వారికి పీసీసీ పీఠం అప్పగించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ పెద్ద దుమారమే రేపింది. దానిపై సాగిన మాటల  యుద్ధం,ఒకరిపై ఒకరు  కోవర్ట్ ఆరోపణలు చేసుకునే వరకి కూడా వెళ్ళాయి.  ఇలా ఆ ఇద్దరి మధ్య రేగిన రగడ ఇంకా చాలా దూరం పోతుందనే రాజకీయ పరిశీలకులు భావించారుఅందుకు తగ్గట్టుగానే,జగ్గారెడ్డి, పీసీసీతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి మీద ప్రత్యేక పంధాలో యుద్దాన్ని ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబందించిన 307 జీఓ  సమస్యతో సహా పలు అంశాలపై చర్చినేందుకు ఈ నెల 17కు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోరారు. అప్పాయింట్మెంట్ ఇవ్వకపోతే అదే రోజున జగ్గారెడ్డి ప్రగతి భవన్ వద్దనే దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.అయితే, జగ్గారెడ్డి ఎత్తుగడను ముందుగానే పసిగట్టిన రేవంత్ రెడ్డి, వ్యూహాత్మకంగా పావులు కదిపి జగ్గారెడ్డి ఎత్తును చిత్తూ చేశారు. జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష బదులు ఉమ్మడి పోరాటం చేయాలని పీసీసీ నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన జూమ్ మీటింగ్‌లో జగ్గారెడ్డి దీక్ష స్థానంలో సీఎల్పీ నేతలు ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 17వ తేదీన జగ్గారెడ్డి పలు అంశాలపై చేయాలనుకున్న దీక్షను వాయిదా వేసుకోవాలని, ఆ స్థానంలో సీఎల్పీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయాలని.. సీఎం అపాయింట్‌మెంట్ అడగాలని నిర్ణయించారు.ఒకవేళ సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ఉమ్మడిగా పోరాటం చేయాలని సీఎల్పీ సమావేశం నిర్ణయించింది. అంటే పీసీసీకి రేవంత్ రెడ్డికి సమాంతరంగా ఆందోళనలు చేసేందుకు జగ్గారెడ్డి చేసిన తొలి ప్రయత్నాన్నే రేవంత్ రెడ్డి తుంచేశారని అంటున్నారు.రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆరోపిస్తూ సోనియా గాంధికి లేఖ రాసినా జగ్గా రెడ్డిని  రేవంత్ రెడ్డి అదే వ్యూహంతో దెబ్బ కొట్టారు. అందుకే తేలు కుట్టిన దొంగలా, జగ్గా రెడ్డికి ఉమ్మడి పోరాటానికి అంగీకరించక తప్ప లేదని, అంటున్నారు. అయితే, బలవంతపు బ్రాహ్మణార్ధం బాపతు ఐక్యత ఎంతకాలం ఉంటుంది అనేదే అసలు ప్రశ్న.. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ... ఎండమావిలో నీరు.. ఉన్నట్లు కనిపిస్తాయే కానీ, ఉండవు.

Related Posts