YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇక టీడీపీలో జోష్... వారానికి ఓ నేత జాయినింగ్

ఇక టీడీపీలో జోష్... వారానికి  ఓ నేత జాయినింగ్

విజయవాడ, జనవరి 20,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని గాడిలో పెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో జోష్ రావాలంటే ఏదో ఒకటి చేయాలి. తన సందేశాలు, స్పీచ్ లతో నేతల్లో మార్పు రాదు. క్యాడర్ లో జోష్ పెరిగితేనే నేతలు కూడా పరుగులు పెడతారు. అలాంటి వాతావరణం రావాలంటే పార్టీలో చేరికలు జరగాలి. చంద్రబాబు తొలి నుంచి అనుసరించే విధానం ఇదే. పార్టీ కాని, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కాని ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన చేరికలనే ఆశ్రయిస్తారు.  అధికారంలో ఉన్నప్పుడు చేరికల కోసం పెద్దగా ప్రయాస పడాల్సిన పనిలేదు. ఆఫర్లు చెబితే వారంతట వారే చేరతారు. కానీ అధికారంలో లేనప్పుడే కష్టం. ఆఫర్లు ప్రకటించేందుకు ఆయన వద్ద శూన్య హస్తాలే ఉన్నాయి. ఒక్క ప్యాకేజీ తప్ప ఆయనేమీ వచ్చే వారికి ఇవ్వలేని పరిస్థితి. పదవులు ఈ మూడేళ్లలో ఒక్కటి కూడా దక్కేపరిస్థితి లేదు. పదవులు దక్కే అవకాశం ఏ మాత్రం ఉన్నా చేరికలుండేవి. కానీ ఆ అవకాశమూ లేదు. కానీ చేరికలు ఉండాల్సిందే. అవి ఉంటేనే పార్టీలో కొంత ఊపు వస్తుంది. అందుకే వచ్చే నెల నుంచి చేరికలను షురూ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. మొన్నటి వరకూ తాను వద్దనుకున్న నేతలను కూడా చేర్చుకునేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారట. ప్రకాశం జిల్లాకు చెందిన పాలపర్తి డేవిడ్ రాజు వైసీపీకి రాజీనామా చేసి చాలా కాలం అయింది. ఆయన చేరికను తొలుత అభ్యంతరం చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక విశాఖకు చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వీడి వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఇమడలేకపోతున్నారు. తిరిగి టీడీపీకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు కూడా చంద్రబాబు ఓకే చెప్పినట్లు తెలిసింది. వీరితో పాటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో కొందరు నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారానికి ఒక నేత చొప్పున చేర్చుకునేందుకు చంద్రబాబు క్యాలెండర్ రెడీ చేస్తున్నారు.

Related Posts