అమరావతి జనవరి 20
పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన జగన్ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇచ్చాయి. దీంతో ఆందోళన కారులను పోలీసులు మార్గమధ్యంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మెరుగైన పీఆర్సీ ఇవ్వలేదని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ రోడ్డున పడ్డారంటే దానికి పీఆర్సీపై ఇచ్చిన జీవోలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చీకటి జీవోలను వెంటనే రద్దు చేసి ఇంతకుముందు పీఆర్సీ ఎలా అమలు చేసేవారో.. ఆ విధంగా ఇవ్వాలని కోరుతున్నామన్నారు. పాత హెచ్ఆర్ఏ కొనసాగించాలని డిమాండ్ చేశారు.గన్‌గారిని ఎంతో నమ్ముకున్నాం.. కానీ.. ‘‘అంతన్నాడు ఇంతన్నాడే జగన్‌గారు.. నట్టేట ముంచేసారే జగన్‌గారు’’ అంటూ పాడారు. ఇవాళ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారంటే.. సీఎం జగన్ అర్ధరాత్రి విడుదల చేసిన జీవోలే కారణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ జీవోలను రద్దు చేసి, న్యాయబద్ధమైన పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.