YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

21 నుండి నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వే

21 నుండి నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వే

హైదరాబాద్ జనవరి 20
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా లక్షణాలున్నవారికి మెడికల్‌ కిట్ అందజేస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులకు పూర్తిస్థాయిలో హోం ఐసొలేషన్, టెస్టింగ్‌ కిట్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

 ఫీవర్ సర్వే,..  ఇంటికే కిట్స్...

తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్  రావు  వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీరు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించి లక్షణాలను ఉన్న వారికి కరోన కిట్ లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఫీవర్ సర్వే సెకండ్ వేవ్ లో మంచి ఫలితాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అంతేకాదు ఈ ఫీవర్ సర్వే నీతి ఆయోగ్ వారి ప్రశంస అందుకుందని చెప్పారు మంత్రి హరీష్ రావు. అయితే ప్రస్తుతం కొంతమంది కొన్ని లక్షణాలు కనిపిస్తున్నా టెస్ట్ లు చేసుకోవడం లేదు. కనుక ఇక నుంచి అన్ని విభాగాల అధికారుల తో ఫీవర్ సర్వే చేయిన్చానున్నామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రవ్యాప్తంగా కరోన కేసులు పెరుగుతున్న నేపధ్యంలో .. రాష్ట్ర వ్యప్తంగా రేపటి నుండి ఫీవర్ సర్వే మొదలు పెట్టనున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మ‌ళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది.. దేశ‌వ్యాప్తంగా కొత్త రికార్డుల వైపు కోవిడ్ కేసులు ప‌రుగులు పెడుతున్నాయి.. మ‌రోవైపు తెలంగాణ‌లోనూ క‌రోనా విజృంభిస్తోంది.. ఈ త‌రుణంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది రాష్ట్ర ప్ర‌భుత్వం. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయ‌న‌.. ఫీవ‌ర్ స‌ర్వేలో కరోనా లక్షణాలున్నవారికి మెడికల్‌ కిట్ అందజేయ‌నున్న‌ట్టు తెలిపారు.. హోం ఐసొలేషన్ కిట్లు, టెస్టింగ్‌ కిట్లు, మ‌రోవైపు ఆస్ప‌త్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తామని వెల్ల‌డించారు మంత్రి హ‌రీష్ రావు.. రెండు నెలల క్రితమే కోటి హోం ఐసోలేషన్ కిట్స్ సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించార‌ని.. 2 కోట్ల టెస్ట్ కిట్ లు సిద్ధం చేయాల‌ని చెప్పార‌ని.. ఈ కిట్స్ ను గ్రామస్థాయి వరకు పంపించామ‌ని తెలిపారు మంత్రి హ‌రీష్ రావు.సిఎం కెసిఆర్ ముందు చూపు తో ఇప్పటికే టెస్టులకు భారీగా కిట్ లను రెడీ చేసుకున్నామని చెప్పారు. ప్రతి జిల్లా, మండలం, గ్రామం.. వార్డుల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.తెలంగాణ రాష్ట్రం వాక్సినేషన్ లో ముందు ఉందని.. మొదటి డోస్ 103 శాతం పూర్తి చేయగా.. రెండో డోస్ 77శాతం పూర్తి అయిందన్నారు. ఇక బూస్టర్ డోస్ వేగవంతం చేయాలని అధికారులను వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ని బస్తి దవాఖాన లో కూడా హోమ్ ఐసోలేషన్ కిట్ లు ఇవ్వనున్నామని తెలిపారు. ఇక నుంచి ఆదివారం కూడా బస్తి దవాఖానలు పని చేస్తాయన్నారు. icmr సూచన ప్రకారం టెస్టింగ్ కంటే ట్రీట్మెంట్ పైనే దృష్టి పెట్టామని చెప్పారు. మంత్రి హరీష్ రావు. ఈ ఫివర్ సర్వే లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచిస్తున్నాని తెలిపారు. ఫిబ్రవరి నెలలో జరగనున్న మేడారం పై కూడా దృష్టి పెట్టాంమని.. అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుందచెప్పారుకరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హోమ్ ఐసోలేషన్ కిట్, టెస్టింగ్ కిట్ లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అటు వాతావరణంలో మార్పులు.. ఇటు కరోనా వ్యాప్తి కారణంగా చాలామందిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు బయటపడుతున్నాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై ఈ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.
భారీగా పెరుగుతున్న కేసులు
కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  బుధ‌వారం రోజున తెలంగాణ‌లో 3557 క‌రోనా కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  దీంతో ఐసీఎంఆర్ క‌రోనా చికిత్సా విధానంపై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు రిలీజ్ చేసింది.  జ‌లుబు, జ్వ‌రం, గొంతునొప్పి, ద‌గ్గు వంటి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి.  రోజుకు ఐదు సార్లుకు మించి ద‌గ్గు, జ్వ‌రం వంటివి వ‌స్తే వైద్యుల స‌ల‌హా మేర‌కు మందులు వినియోగించాలి. ఇంట్లోనే ఉన్న‌ప్ప‌టికీ భౌతిక దూరం పాటించాలి, ఇంట్లో ఉన్నా మాస్క్ త‌ప్ప‌న‌స‌రిగా ధ‌రించాలి.  అదేవిధంగా నీరు త‌గినంత‌గా తీసుకోవాలి. ఐదు రోజులు దాటినా ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించి ఆసుప‌త్రిలో చేరాలి.  దీర్ఘ‌కాలిక జ‌బ్బులు ఉన్న‌వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని ఐసీఎంఆర్ తెలియ‌జేసింది.  నిమిషానికి 24 సార్లు కంటే ఎక్కువ‌సార్లు శ్వాస తీసుకుంటే, రక్తంలో ఆక్సీజ‌న్ శాతం 90 నుంచి 93 శాతం మ‌ధ్య‌లో ఉంటే మ‌ధ్య‌స్థ వ్యాధిగా గుర్తించాలి.  శ్వాస తీరు ఎలా ఉన్న‌దో ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకుంటుండాల‌ని, నిమిషానికి 30 సార్లు కంటే అధికంగా శ్వాస తీసుకుంటే, ర‌క్తంలో ఆక్సీజ‌న్ శాతం 90 శాతం కంటే దిగువ‌కు ప‌డిపోతే తీవ్ర‌మైన వ్యాధిగా గుర్తించాల‌ని, ఐసీయూలో చేర్చి చికిత్స అందించాల‌ని ఐసీఎంఆర్ స్ప‌ష్టం చేసింది.  

Related Posts