హైదరాబాద్, జనవరి 20,
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగుతున్నాయి. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య రెండున్నర లక్షలు దాటేసింది. ఇక సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు ఎవరినీ కరోనా వదలడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తాము కరోనా బారిన పడ్డామన్న పోస్టులు పెరిగిపోతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. బుధవారం నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని రకాల ప్రోటోకాల్స్‌ని ఫాలో అవుతున్నాను. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నాతో సన్నిహితంగా ఉన్న వారంతా ఐసోలేషన్‌లోకి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి అంటూ రాసుకొచ్చారు.ఇక కిషన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అన్న అంటూ కామెంట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కిషన్ రెడ్డి త్వరగా కరోనా నుంచి పూర్తిగా కోలుకావాలని కోరుతూ పోస్ట్ చేశారు.