YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉద్యోగాల్లో వృద్ది రేటు

ఉద్యోగాల్లో వృద్ది రేటు

ముంబై, జనవరి 21,
కరోనా ఒక వైపు వీరవిహారం చేస్తున్నా ఉద్యోగ నియామకాల్లో మంచి వృద్ధిరేటు కనబడుతోంది. 2021 ద్వితీయార్థంలో అంటే జూలై నుంచి డిసెంబర్ వరకూ జరిగిన నియామకాల్లో మంచి వృద్ధిరేటు కనిపించింది. గత ఏడాది ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి జూన్‌ వరకూ జరిగిన నియామకాలతో పోలిస్తే వృద్ధిరేటులో పురోగతి కనిపించింది. ఇండీడ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.2021 ప్రథమార్థంలో ఉద్యోగాల కల్పన 44 శాతం జరిగితే ద్వితీయార్థంలో మాత్రం అది 53 శాతానికి పెరిగింది. ఎంట్రీ లెవల్ 81 శాతం. జూనియర్ లెవల్ క్యాండిడేట్స్ 66 శాతం జరగగా, ప్రథమార్థంలో మాత్రం ఎంట్రీ లెవల్ 69 శాతం, జూనియల్ లెవల్ ఉద్యోగాల భర్తీ 57శాతంగా నమోదైంది. కరోనా కారణంగా తమ ఉద్యోగ ప్రాధాన్యతలను, లక్ష్యాలను పునర్ నిర్వచించుకున్నారని ఇండీడ్ తెలిపింది. 79 శాతం మంది ఉద్యోగుల ఆలోచనా సరళిలో మార్పులు వచ్చాయని సర్వేలో తేలింది. డిఫరెంట్ కెరీర్ ఆలోచనలో వారు వున్నారు.ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 31 శాతం అబ్బాయిలు, 19 శాతం అమ్మాయిలు తమ ఆలోచనల్ని మార్చుకుని కొత్త ఉద్యోగాల వైపు మొగ్గుచూపారు. ప్రతి పది మందిలో ముగ్గురి కెరీర్ ఆలోచనలు విప్లవాత్మకంగా మారాయని అంటున్నారు.
51 శాతం మంది తమ ప్రస్తుత ఉద్యోగం ఒక ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తుందా అని ఆలోచించారు
67శాతం మంది తాము సరైన ఉద్యోగంలో ఉన్నామా అని తమని తాము ప్రశ్నించుకున్నారు
61శాతం మంది జీవిత ప్రాధాన్యతలకు అనుకూలంగా తమ ఉద్యోగంలో మంచి మార్పు గురించి ఆలోచించారు
తాము చేస్తున్న ఉద్యోగంలో 68శాతం — ఉద్యోగ సంతృప్తి, 62శాతం మంది- జీతం. 61శాతం — జీవితం-ఉద్యోగం సమతుల్యం గురించి ఆలోచించారు. అలాగే 49శాతం మంది 5 రోజుల పనిదినాలపై దృష్టి పెట్టారు. 51శాతం మంది రోజుకి 6-8 గంటలకు ప్రాధాన్యత ఇచ్చారు. 2021 ద్వితీయార్థంలో సేల్స్ రంగంలో అత్యధికంగా రిక్రూట్ మెంట్లు జరిగాయి. సేల్స్ లో 73శాతం, టెక్నాలజీలో 61 శాతం, మార్కెటింగ్ రంగంలో 59శాతం రిక్రూట్ మెంట్లు జరిగాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 69 శాతం, ఈ కామర్స్, స్టార్టప్‌లో 65శాతం, టెలికాంలో 47శాతం ఉద్యోగాలు లభించాయి.

Related Posts