YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పీఆర్సీపై కేబినెట్ ఆమోదం

 పీఆర్సీపై  కేబినెట్ ఆమోదం

విజయవాడ, జనవరి 21,
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఈ భేటీలో చర్చించారు. ఒమిక్రాన్‌ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చెయ్యాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కారుణ్య నియామకాలు జరపాలని నిర్ణయించింది.ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. ‘ఈబీసీ నేస్తం’ చెల్లింపులతో పాటు వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు ఈ ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.  మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న ఐసీడీఎస్ ప్రాజెక్టుకు పౌష్టికాహారం బాలామృతం, పాలు సరఫరాను గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Related Posts