విశాఖపట్నం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగ రాలు, పట్టణాల్లో ప్రజలకు ఆస్తి పన్ను మోత మొదలైంది. ఇకపై ప్రతి ఏటా ఇది కొనసాగుతుంది.దశాబ్దాలుగా అమల్లో ఉన్న అద్దె ఆధారిత పన్ను విధానం స్థానే... ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను వేసే విధానా న్ని తెచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం కడుతున్న పన్నుని 10 నుంచి 15 శాతం పెంచుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు సంబంధించిన డిమాండ్ నోటీసులను జారీ చేస్తోంది.దీంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, నగర పంచాయ తీల్లో సుమారు 33.67 లక్షల అసెస్ మెంట్లు ఉండగా... ఇప్పటికే సగానికి పైగా భవనాల యజమానులకు నోటీసులు వెళ్లాయి.ఈ నెలాఖరులోగా మొత్తం నోటీసులు జారీ చేయనున్నా రు.అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ విశాఖ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విశాఖలో అత్యది కంగా ఉన్న మురికివాడల్లోనూ పన్ను భారం విదించడం సరికాదని,ప్రభుత్వం ఆర్ది లోటు ఉంటే దాన్ని భర్తీ చేసేందు కు ఆధాయ మార్గాలను అన్వేషించాలే కానీ ప్రజలపై భారాన్ని మోపడం సరికాదని అంటున్నారు.