హైదరాబాద్ జనవరి 21
భారతదేశంలో అతిపెద్ద నిర్మాణ రంగ యంత్ర సామాగ్రి తయారీదారు సానీ ఇండియా, తమ కీర్తికిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంటూ భారతదేశంలో మొట్టమొదటి సారిగా 800 టన్నులను పైకి ఎత్తగల క్రాలర్ క్రేన్‌ను ద్వారకేష్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్‌కు అందజేసింది. గుజరాత్‌లోని ఆనంద్ వద్దనున్న సానీ ఇండియా యొక్క మహోన్నతమైన వినియోగదారు ఈ సంస్థ. భారతదేశంలో అతిపెద్ద క్రాలర్ క్రేన్ సానీ ఎస్‌సీసీ8000ఏ. వైవిధ్యమైన డిజైన్ మరియు భద్రతా ఫీచర్లు దీనిలో ఉన్నాయి. పరిశ్రమలో వినూత్నమైన క్రేన్‌గా ఇది నిలిచింది. ఈ భారీ క్రేన్‌ను ద్వారకేష్ ట్రాన్స్‌పోర్ట్ సంస్ధ విండ్ టర్బైన్ ఇన్‌స్టాలేషన్స్ కోసం వినియోగించనుంది. ద్వారకేష్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ యజమానులు రాజేంద్ర ద్వివేది మరియు దిపాల్ ద్వివేది, రోమల్ ద్వివేది మరియు వారి కుటుంబ సభ్యులు ఈ క్రేన్‌ను అందించే వేడుకలో పాల్గొన్నారు. సానీ ఇండియా నుంచి దీపక్ గార్గ్, మేనేజింగ్ డైరెక్టర్, సానీ ఇండియా అండ్ సౌత్ ఆసియా ; సంజయ్ సక్సేనా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఆఫ్ హెవీ ఎక్విప్‌మెంట్ బిజినెస్ యూనిట్ ; వినయ్ ఓజా– రీజనల్ హెడ్ (హెచ్‌ఈ) వెస్ట్ రీజియన్ మరియు కపిల్ జైన్–జనరల్ మేనేజర్, ఇనిస్టిట్యూషనల్ సేల్స్ సైతం ఎస్‌సీసీ8000ఏ క్రేన్‌ను ద్వారకేష్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్‌కు అందించే వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సానీ ఇండియా అండ్ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ ‘‘ద్వారకేష్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్‌తో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా వారు మాకు అతి ముఖ్యమైన వినియోగదారులలో ఒకరిగా ఉన్నారు. మా బంధం మరింతగా వృద్ధి చెందడంతో పాటుగా నూతన మార్కెట్‌లనూ ఒడిసిపట్టుకుంటుంది. ద్వారకేష్ ట్రాన్స్‌పోర్ట్ ఇప్పటికే 15 క్రేన్స్ ను సానీ ఇండియా నుంచి తీసుకుంది. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద క్రాలర్ క్రేన్ యజమానిగా నిలిచింది. వారి వెంచర్లలో వారు పూర్తి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాము మరియు వారితో కలిసి ఈ ప్రయాణంలో నూతన మైలురాళ్లను అధిగమించాలని కోరుకుంటున్నాము’’ అని అన్నారు