YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణలో మరోసారి పెరుగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

తెలంగాణలో మరోసారి పెరుగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

హైదరాబాద్ జనవరి 21
కరోనా కల్లోలం వేళ ఆదాయాలు పడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయమార్గాలపై పడింది. తెలంగాణలో మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అదనంగా రూ.4500 కోట్ల రాబడికి తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.ఆస్తులు భూముల విలువపై సహేతుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50శాతం పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.ఇక స్థలాల విలువను 35శాతం అపార్ట్ మెంట్ల విలువను 25శాతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఎకరం రూ.30 లక్షలకు పైగా పలుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలను 60 నుంచి 150 శాతం పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం.కాగా గత ఏడాది వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తుల విలువతో పాటు 20శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే..

Related Posts