YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కరోనాను వదలని గ్యాంగ్

కరోనాను వదలని గ్యాంగ్

హైదరాబాద్, జనవరి 22,
గడగడలాడిస్తోన్న కరోనానీ క్యాష్ చేసుకుంటుందో కిలాడీ గ్యాంగ్. కరోనా అంటేనే జనం ఆమడదూరం పారిపోతోంటే.. ఆ వైరస్‌నే తమ మోసాలకు అనుకూలంగా మార్చుకున్నారు కేటుగాళ్లు. కరోనా టెస్టులు చేయితే ఫలితాల్లో పాజిటివో.. నెగెటివో పక్కన బెడితే మీకు ఏది కావాలంటే ఆ రిపోర్టు ఇచ్చేస్తున్న ముఠా ఘరానా మోసం బయటపడింది. నకిలీ కరోనా టెస్టులు, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు ఇస్తున్న గ్యాంగ్‌ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.నగరంలో నకిలీ కరోనా టెస్టులు చేస్తున్న ముఠాని అరెస్టు చేసినట్లు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. నకిలీ ఆర్టీపీసీసీఆర్ టెస్టులతో పాటు నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నట్లు గుర్తించామన్నారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ నకిలీ సర్టిఫికెట్లు దొరుకుతున్నాయని.. వ్యాక్సిన్ వేసుకోకపోయినా వేసుకున్నట్లు సర్టిఫికెట్లు ఇస్తున్ ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.నిందితుడు లక్ష్మణ్ నుంచి నకిలీ ఆర్టీపీసీఆర్ రిపోర్టులు 65, శాంపిల్ కలెక్షన్ కిట్లు 20, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. మరో నిందితుడు తారిఖ్ హబీబ్ నుంచి 50 నకిలీ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు సీజ్ చేశామన్నారు. నకిలీ ఆర్టీపీసీఆర్ కోవిడ్ 19 రిపోర్ట్స్ 10, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు ప్రభాత్ కుమార్, గులాం షకీల్, అబ్దుల్ బషీర్, అన్సారీలను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు చెప్పారు.
పీక్స కు చేరుకున్న కేసులు
తెలంగాణలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రారంభంలో పదుల సంఖ్యలో వచ్చిన పాజిటివ్ కేసులు క్రమంగా వందలు దాటి వేలకు చేరుకున్నాయి. ఈరోజు అత్యంత గరష్టంగా నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిపోవడంతో నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తుందని ఇప్పటికే హెచ్చరికలున్నాయి.కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 92 శాతం వరకూ ఒమిక్రాన్ కేసులే ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,207 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఈరోజు 1825 మంది కోలుకోగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ మరణాలు 4067కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 26 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1,645 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 380, రంగారెడ్డి జిల్లా పరిధిలో 336, హన్మకొండలో 154, సంగారెడ్డిలో 107 కేసులు అత్యధికంగా నమోదైనట్లు తెలుస్తోంది. మిగిలిన అన్ని జిల్లాల్లో వందలోపే కొత్త కేసులు నమోదయ్యాయి.

Related Posts