YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బడ్జెట్ సమావేశాల్లో ఆందోళేనా

బడ్జెట్ సమావేశాల్లో ఆందోళేనా

హైదరాబాద్, జనవరి 22,
కేంద్రంపై మరో పోరాటానికి రెడీ అవుతోంది టీఆర్ఎస్ పార్టీ… పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో దూకుడు పెంచాలని అధిష్టానం నిర్ణయించింది. కేంద్ర వైఖరిపై గట్టిగా పోరాడాలని సిగ్నల్స్ రావడంతో… ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టారు టీఆర్ఎస్‌ ఎంపీలు. ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి..‌. దాంతో గులాబీ పార్టీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు మొదలుపెట్టింది. విభజన చట్టం అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని భావిస్తోంది. ఇక పార్లమెంట్ సమావేశాల కంటే ముందు కేసీఆర్ దిశానిర్దేశంతో పార్లమెంట్ సమావేశాలల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మరింత క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత అప్పడు ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి… ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగడంపై నిర్ణయాలు ఉంటాయని గులాబీ పార్టీ వర్గాలు అంటున్నాయి.ఇక‌, గడిచిన పార్లమెంట్ సమావేశాలలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు అంశాలపై ఎన్డీఏ సర్కార్ ను ఇబ్బంది పెట్టేలా టీఆర్ఎస్ ఎంపీలు దూకుడుగా వ్యవహరించారు. అప్పట్లో ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగినన్ని రోజులు టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వడంతో పాటు…సభా కార్యకలాపాలను అడ్డుకున్న విష‌యం తెలిసిందే.

Related Posts