తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజవర్గం రామచంద్రపురం పట్టణంలో సంక్రాంతి సందర్భంగా వి.ఎస్.ఎం కాలేజి ఆవరణంలో సాంప్రదాయ సంక్రాంతి పేరుతో ఎంతో అట్టహాసంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఇప్పుడు కరోనాను కానుకగా అందించి రామచంద్రపురం నియోజకవర్గాన్ని పడకేసేలా చేసాయి. ప్రతి ఏటా నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో ప్రజలు ఎక్కడికక్కడే పండుగను మూడు రోజులు కుటుంబ సభ్యులతో జరుపుకునేవారు.ఈ సారి మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ సూచనల మేరకు మెప్మా మరియు డ్వాక్రా అధికారులు మంత్రిగారి సంబరాలకు తప్పకుండా హాజరుకావాలని హుకుం జారీ చేశారు. దీంతో చిన్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెట్లో వందలాదిమంది గుమిగూడారు వారిలో చాలామంది మాస్కులు పెట్టకుండా సామాజిక దూరం పాటించకుండా ఉండడంతో అక్కడ ఉండడంతో భద్రతా విధుల్లో పాల్గొన్న పోలీసులు, అధికారులు, అనధికారులు, వైద్య సిబ్బంది ఎత్తున కోవిడ్ బారిన పడ్డారు. మంత్రితో సహా పోలీసులు, భద్రతా సిబ్బంది, వైద్య సిబ్బంది, డాక్టర్లు, కొందరు ఆసుపత్రి పాలు కాగా మరికొందరు గుట్టుగా హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఎందుకొచ్చిన సంక్రాంతి సంబరం రా దేవుడా అంటూ నియోజవర్గ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.