విశాఖపట్నం
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ప్రతీ జిల్లాకి ఒక ఎయి ర్పోర్ట్ కట్టాలి, దానికోసం ప్రతిపాదనలు సిద్దం చేయండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, సర్వనాశనం చేశారని అన్నారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజిలు 7,880 కోట్లతో కడతాడని అనౌన్స్ చేసి, క్రిందటి సంవత్సరం మే 30 వ తేదీన 14 మెడికల్ కాలేజీలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారని ఆ కాలేజిలు ఏమయ్యాయయని ప్రశ్నించారు. ఎంప్లాయ్స్ కి , పెన్షన్ దారులకు టైం కి డబ్బులు చెల్లించలేకపోతున్నారని, అలాగే రిటైర్ అయిన ఎంప్లాయ్స్ కి ఆరు నెలల నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నారని ఇలాంటి పరిస్థి తుల్లో జిల్లాకో ఎయిర్పోర్ట్ ఎలా కడతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడానికి నిధులు లేవని అన్నారు.విజయనగరంలో ట్రైబుల్ యూనివర్సి కట్టలేకపోయారని, కానీ, జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా.. అని నిలదీశారు.