మచిలీపట్నం
మంత్రి కొడాలి నాని శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బొండా ఉమా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న కేసినో తన కన్వెన్షన్ లో ఆడితే పెట్రోల్ తో తగలబెట్టుకుంటా అన్నాడు కొడాలి నానీ. డేట్ టైం నువ్వే ఫిక్స్ చేయి, నీ కన్వెన్షన్ లో ఆడినట్టు మేము ప్రూవ్ చేస్తామని అన్నారు. మేము ఆరోపణలు ప్రూవ్ చేయడానికి రెడీ గా ఉన్నాం, నిరూపించలేదు అంటే మేము తగలబెట్టుకుంటాం . నిరూపిస్తే నువ్వు తగలబెట్టుకో, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము రెడీ, లేదా మేము ఫిక్స్ చేస్తాం. పెట్రోల్ డబ్బా నువ్వు తెచ్చుకున్నా సరే లేదా మేము తీసుకూరమ్మన్నా సరే... తగలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉండు అంటూ బొండా ఉమా ఫైర్ అయ్యారు.