ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియా నిశితార్థం ఈ రోజు హైదరాబాద్ లో అంగరంగవైభవం గా జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన భార్గవ్‌తో హైదరాబాద్‌లోని మంత్రి అఖిల ప్రియ నివాసంలో ఈ శుభకార్యం జరిగింది. ఈ శుభకార్యానికి ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరిద్దరి వివాహం ఈ నెల ఆగస్టు 29న జరగనుంది.