హైదరాబాద్
గత నెల ఎల్బీనగర్ ప్రాంతంలోని సంతోషి మాత దేవాలయం లో జరిగిన చోరీ కేసును ఎల్బీనగర్ సిసిఎస్ పోలీసులు ఛేదించారు. డిసెంబర్ 3 & 4 న దేవాలయం లో అమ్మవారి నగలు చోరీ గురయ్యాయని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, సీసీటీవీ కెమెరాల ఆధారాలతో, అంతరాష్ట్ర దొంగల పని అని గుర్తించామని అన్నారు. ఇందులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసామని సిపీ మహేష్ భగవత్ వెల్లడించారు.
ఈ గ్యాంగ్ లో గుంటూరు జిల్లా కు చెందిన పొన్నూరి చిన్న సత్యనంద్ అలియాస్ సతీష్ ప్రధాన నిందితుడి తో పాటు మరో ముగ్గురు నిందితులను చేసామన్నారు. మరో నిందితుడు నరేందర్ పరారీలో ఉన్నారని, వీరి వద్దనుండి మొత్తం 19 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నామని, నిందితుల నుండి 215 గ్రాముల బంగారం, ఒక కారు, ఒక బుల్లెట్ వాహనం. నిందితుల పై రెండు తెలుగు రాష్ట్రాల 10 కేసులు నమోదు అయ్యాయని అన్నారు.