YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్‌ పై షర్మిల ఫైర్

కేసీఆర్‌ పై షర్మిల ఫైర్

హైదరాబాద్, జనవరి 22,
కేసీఆర్ సర్కార్ పై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  ప్రస్తుతం జరగుతున్న ఫీవర్ సర్వేపై ట్విట్టర్ వేదికగా ఆమె కేసీఆర్ప్రభుత్వాన్ని నిలదీసారు. ఏ చిన్న సమస్య అయినా ఈ మధ్యన ట్విట్టర్‌ ద్వారా కేసీఆర్‌ సర్కార్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికి ఫీవర్ టెస్టులు చేసే హెల్త్ వర్కర్ల ప్రాణాలంటే పట్టింపు లేదా? వాళ్ళ ప్రాణాలు లెక్క లేదా? చీర కొంగులు.. కర్చీఫులు కట్టుకొని సర్వే చేయాల్నా?కనీసం వాళ్లకు మాస్క్ లు, శానిటైజర్ల్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందా ప్రభుత్వం? ప్రజల ప్రాణాల కోసం హెల్త్ వర్కర్లు వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకొని పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు .. ఫ్రంట్ లైన్ వారియర్లకు మాస్క్ లు .. శానిటైజర్ల్ తో పాటు .. వారికి ఈ కరోనా కాలంలో జీతంతో పాటు స్పెషల్ బోనస్ ఇవ్వాలని,వారికి కరోనా సోకితే స్పెషల్ ట్రీట్మెంట్ .. ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ షర్మిల ట్విట్‌ చేశారు.

Related Posts