లక్నోజనవరి 22
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్ కు తెరపడింది. మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ శనివారంనాడు అధికారికంగా ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌పాల్ యాదవ్ ఈ ప్రకటన చేశారు.