YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బడా బాబులకు రైతు బంధు కట్

 బడా బాబులకు రైతు బంధు కట్

నల్గొండ, జనవరి 24,
రైతులు తమ ఖాతాలో రైతుబంధు పడుతుందని జిల్లాలో 1,441మంది రైతులు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 28 నుంచి 8వ విడత రైతుబంధు పంపిణీ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. గుంట నుంచి ఎంత భూమి ఉన్నా ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతులకు సర్కారు సాయం అందిస్తున్నది. ముందుగా ఎకరం భూమి నుంచి రైతుబంధు పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రస్తుతం  గత మూడు రోజుల నుంచి రైతు ఖాతాలో డబ్బులు జమ కావడం లేదు. సూర్యాపేట జిల్లాలో  2,70,853 మంది  రైతులు ఉన్నారు. వీరికి రైతు బంధు ద్వారా రూ.314 కోట్లు చెల్లించాల్సి ఉంది. డిసెంబర్ 28 నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ ప్రక్రియ కొనసాగతుండగా,  మూడు రోజుల క్రితం నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటివరకు 2,60,412 మంది  రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ. 308 కోట్లు జమ చేసింది. ఇంకా 1,441 మంది రైతులకు రూ.5.38 కోట్లు జమ చేయాల్సి ఉన్నది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని సమాచారం.కొంత మంది రైతుల్లో రైతు బంధు డబ్బులు జమ కాకపోవడంతో మిగిలిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాం నుంచి మొదలుకొని పదుల సంఖ్యలో ఎకరాలు ఉన్నవారికి కూడా డబ్బులు అందాయి. కేవలం 1,441 మంది రైతులకు మాత్రమే ఇంకా డబ్బులు జమ కాలేదు వీరంతా దాదాపు పెద్ద రైతు‌లే అని పంపిణీ ప్రక్రియ పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. దీంతో తమ ఖాతాలో డబ్బులు పడుతాయో లేదో అని బడా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కావాలనే రైతు బంధు నిలిపివేసిందా అనే అనుమానం కూడా కలగక మానట్లేదు.. కాగా చివరి బిల్లు హైదరాబాద్ ట్రెజరీ పరిధిలో పెండింగ్ లో ఉన్నదని, రైతుల ఖాతాల్లో జమ ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  రామారావు వెల్లడించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మిగిలిన రైతు ఖాతాలో కూడా రైతుబంధు డబ్బులు జమ అవుతాయని ఆయన తెలిపారు.

Related Posts