
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన పప్పు దినుసుల ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఒకప్పుడు పప్పుల ధరలు కిలోకు రూ.150లకు పై మాటే. 2016కు ముందు ప్రతి ఏడాది పప్పుల ధరలు పెరిగేవి. కానీ వ్యవ సాయ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత 2016 తర్వాత ప్రతి సంవత్సరం రూ.10-25ల వరకు పప్పు దినుసుల ధరలు తగ్గడం విశేషం. ప్రస్తు తం కిలో కందిపప్పు హోల్‌సెల్ ధర రూ.70, రిటైల్ మార్కె ట్‌లో ధర రూ.75 పలుకుతున్నది. ఇదేవిధంగా పెసరు, మినప, శనగ పప్పుల ధరలుకూడా తగ్గాయి. గత ప్రభుత్వాల హయాం లో రైతులు పప్పులు పండించేందుకు వెనుకంజ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ ప్రణాళికతో 2016-17 సంవత్సరంలో 4.50లక్షల హెక్టార్లు పండించగా.. 2017-18 సంవత్సరంలోని ఒక విడుత పంటలో 2.60 లక్షల హెక్టార్లు పండించారు. అంతేకాకుండా పండించిన పంటను రాష్ట్రం కొనుగోలు చేయడం, సరైన ధరను చెల్లించడంతో రైతులు పప్పు దినుసులు పండించేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2016-17లో రూ.1053కోట్ల వ్యయం తో 22లక్షల క్వింటాళ్లను, 2017-18లో రూ. 1450 కోట్ల వ్యయంతో 25లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేసింది. కందుల కొనుగోలుకు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 95 కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. మార్కెట్లో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం కూడా ధరల తగ్గుదలకు ఒక కారణం.