YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇక సకల జనుల సమ్మెనా...

ఇక సకల జనుల సమ్మెనా...

విజయవాడ, జనవరి 24,
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అనూహ్యమైన ఐక్యత చూపిస్తున్నారు. ఇప్పటి వరకూ ఉద్యోగ సంఘాల నేతల్లో విభేదాల కారణంగా ఏకతాటిపైకి వచ్చి చేసిన పోరాటాలేమీ లేవు. చివరికి పీఆర్సీ పోరాటంలోనూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పోటీ సంఘాలు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఏ ఒక్కరూ కూడా తమకు అన్యాయం జరగడం లేదని భావించడం లేదు. అత్యంత దారుణంగాప్రభుత్వం మోసం చేసిందని.. ఇది అంగీకరిస్తే ఇక తమకు భవిష్యత్ ఉండదనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఒకే తాటిపైకి వచ్చారు. ఉద్యోగులు కూడా అన్ని శాఖల వాళ్లు.. సమ్మెకు సిద్ధమవుతున్నారు.ఉద్యోగులంతా ఆందోళనల్లో పాల్గొననున్నారు. ప్రజారోగ్య సిబ్బందితో పాటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా తాము కూడా సమ్మెలో పాల్గొంటామని చెబుతున్నారు. సోమవారం సీఎస్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఒక్క పోలీస్ డిపార్టుమెంట్ మినహా అన్ని శాఖలూ సమ్మెలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ ఒక్కరూ ప్రభుత్వం విషయంలో సానుకూలంగా లేరు. ప్రజలకు ఇబ్బందులు పేరుతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కొంతమందిని అయినా వెనక్కి తగ్గించే ప్రయత్నం చేసినా తగ్గ కూడదని భావిస్తున్నారు. సకల జనుల సమ్మె అంటూ జరిగితే.. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇదే మొదటి సారి అనుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో సకల జనుల సమ్మె సక్సెస్ అయింది. రాష్ట్రాన్ని సాధించారు. దాని వల్ల ఏపీ ఉద్యోగులకు అప్పట్లో మేలు జరిగింది. నలభై మూడు శాతం పీఆర్సీ వచ్చింది . కానీ ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏపీ ఉద్యోగులే సకల జనుల సమ్మె చేయాల్సి వస్తోంది. సమ్మె నివారణకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నది ఇప్పుడు కీలకం. హెచ్‌ఆర్‌ఏను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రశ్నే లేదని సీఎం తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరం. ఉద్యోగుల సమ్మెను పట్టించుకోకుండా ప్రజల ఇబ్బందులను వారికి వదిలేసి.. ఉద్యోగుల సమ్మె వల్ల మీకు ఈ కష్టాలు అని.. వారిపై వ్యతిరేకత పెంచే వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు

Related Posts