YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు వైసిపి లో వార్ ఆనం వర్సెస్ కోటంరెడ్డి

నెల్లూరు వైసిపి లో వార్ ఆనం వర్సెస్ కోటంరెడ్డి

నెల్లూరు
నెల్లూరు రూరల్ మండలం  కోడూరుపాడు గ్రామం  1వ వార్డు లో  ప్రభుత్వ భూముల ఆక్రమణకుగురయ్యాయని డీ సీ సీ బీ మాజీ చైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి పోరు ప్రారంభించారు. కోడూరుపాడు పెన్నా ఏటి పొర్లు కట్ట భూమి కొందరు ఆక్రమించి లే అవుట్ లు వేస్తున్నారని సుమారు 30 ఎకరాలకు పైగా  ఆక్రమించారని గ్రామస్థుల ఆరోపణ. కోడూరుపాడు లో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో 720 మంది, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 పట్టాలు ఇవ్వడం జరిగిందని అయన అన్నారు. దాదాపు 1000 కుటుంబాలకు పట్టాలు ఇచ్చారని 1000 పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయని అయన ప్రశ్నించారు. కోడూరుపాడు లో పెన్న ఏటికట్ట ప్రభుత్వ భూమి లో ఎటువంటి అనుమతులు లేకుండా లే అవుట్ లు వేయడం సరికాదని అయన అన్నారు.  ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా ఉంటె ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ భూమిని వినియోగించుకోవచ్చని,  దానికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు.
ఈ విషయం పై కలెక్టర్,  రెవెన్యూ అధికారుల తో చర్చించి  న్యాయం కోసం పోరాడుతామని గ్రామస్థులు లకు హామీ ఇచ్చారు. దీనిపై వారిని ప్రశ్నించగా రూరల్ యం.యల్.ఏ కోటంరెడ్డి పేరు చెపుతున్నారని కానీ  వారికి ఈ ఆక్రమణకి ఇందులో వారికి సంబంధం లేదని అకారణం గా వారి పేర్లు ఉపయోగిస్తున్నారని అంటున్నారు. కోడూరుపాడు సర్కారు పేపర్ మిల్లు లో వేస్తున్న రాధ కౌంటీ  లేఔట్ లో దాదాపు 18 ఏకరాల పై చిలుకు  ప్రభుత్వా భూమిని  ఆక్రమించినట్లు సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది.  అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతొ  అక్కడ ప్లాట్స్ కొన్నవారు నష్టపోతారు. దీనిపై అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుంటే బావుంటుందని అన్నారు. అధికార పార్టీ పేరు చెప్పి మా పార్టీకి చడ్డపెరు తీసుకురావదు. రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని అన్నారు. ఇది ఇలానే కొనసాగితే చూస్తూ ఉండబోమని ఆనం హెచ్చరించారు..

Related Posts