YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఓఅర్ఆర్ పేజ్-2ప్రాజెక్టు ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఓఅర్ఆర్ పేజ్-2ప్రాజెక్టు ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి
రూ.1200 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్ట్ లో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ అల్కాపురిలో రూ.587 కోట్లతో ఓఅర్ఆర్ పేజ్-2ప్రాజెక్టు ను రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి వరకూ తమ ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిందన్నారు. రానున్న ముప్పై ఏళ్లలో హైదరాబాద్ కు వచ్చే జనాభాను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపు ఉన్న 25 మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా కల్పించేందుకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటిని సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్ లో ఇక్కడ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి పై సీఎం కేసీఆర్ దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారన్నారు. ఒక ప్రత్యేకమైన విజన్ తో ముఖ్యమంత్రి నేతృత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నగరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. తెలంగాణ రాక ముందు… వచ్చిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. మంచినీటి సరఫరాకు 1200 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఒక్క రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రూ.250 కోట్లు మంజూరు చేశారన్నారు. నార్సింగ్ దగ్గర ఓఆర్ఆర్ పై వెళ్ళడానికి అవకాశం కల్పించేలా పనులు జరుగుతున్నాయన్నారు. జీహెచ్ఎంసీ తో పాటు శివార్లలో ఉన్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీ ల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. నాళాలు, రోడ్లు, చెరువుల సుందరీకరణ, త్రాగునీరందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో అడుగులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, వాణీ దేవి, అధికారులు పాల్గొన్నారు.

Related Posts