YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఎమిరేట్స్ పై దాడికి తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు... డ్రోన్ల సాయంతో వరుసగా బాంబుదాడులు

ఎమిరేట్స్ పై దాడికి తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు...  డ్రోన్ల సాయంతో వరుసగా బాంబుదాడులు

న్యూ ఢిల్లీ జనవరి 24
గల్ఫ్ దేశాల్లో అనిశ్చితి నెలకొంది. యూఏఈ-యెమెన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ మద్దతు ఇస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు ఎమిరేట్స్ పై దాడికి తెగబడ్డాయి. డ్రోన్ల సాయంతో వరుసగా బాంబుదాడులు చేస్తుండడంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. సౌదీ రాజధాని అబుదాబి రాజధానే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో అరబ్ దేశాలు దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.  దీంతో మరోసారి ప్రపంచానికి చమురు సంక్షోభం తప్పదా? అన్న ఆందోళనలు నెలకొన్నాయి.
సౌదీ సరిహద్దుల్లో పదే పదే హౌతీ తిరుగుబాటుదారులు దాడుచేస్తున్నా.. కొన్ని రోజుల కింద సరిహద్దు  దాటి యూఏఈ విమానాశ్రమయంలోకి మొదటిసారి వచ్చారు. అయితే ఈ దాడులను అమెరికా ఇజ్రాయెల్ దేశాలు ఖండిస్తున్నాయి. కాగా ఒకప్పుడు సౌదీకి మద్దతుగా ఉన్న యెమెన్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకమైంది..?2015లో యెమెన్ రాజధాని  సనాను హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించారు. ఆ సమయంలో ఆ దేశ అధ్యక్షుడు అరబ్ మన్సూర్ హాదీ యెమెన్ వదిలి పోయాడు. దీంతో హౌతీ తిరుగుబాటుదారులు ఉత్తర యెమెన్లోని చాలా ప్రాంతాలపై ట్టు సాధించారు. అంతకుముందు అధ్యక్షుడు హాదీకి సౌదీ అరేబియా మద్దతు ఉంది. ఈ చనువుతో ఇదే సంవత్సరంలో హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ సేనలు దాడులు ప్రారంభించాయి. అలా దాదాపు కొన్ని రోజుల పాటు హౌతీ తిరుగుబాటు దారులపై దాడులు కొనసాగించారు. దీంతో హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకున్నారు. అప్పటి నుంచి ఏడేళ్లుగా హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.ఈనెల 17న హౌతీ తిరుగుబాటుదారులు యూఏఈ రాజధాని అబుదాబిపై డ్రోన్ల దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఇద్దరు భారతీయులు ఒక పాకిస్థాన్ పౌరుడు మరణించారు. ముసప్పా పారిశ్రామిక ప్రాంతంలోని అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ఆల్ బతీన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నిర్మాణ స్థలంలో రెండు బాంబు దాడులు చేశారు. అంతేకాకుండా ఈ దాడులకు పాల్పడింది తామేనని హౌతీ తిరుగుబాటుదారులు వెల్లడించారు.  యెమెన్లోని షాబ్వా మరీబ్ రీజీయన్లపై కూడా దాడికి ప్రతీకారంగా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే షాబ్వా మరీబ్ రీజీయన్లపై హౌతీ తిరుగుబాటుదారులకు పట్టుంది. అందుకే వారు అరబ్ దేశంపై విరుచుకుపడినట్లు తెలుస్తోంది.అయితే హౌతీ తిరుబాటుదారుల దాడులకే అరబ్ దేశం ప్రతీకారం తీర్చుకుంటోంది. యెమెన్ రాజధాని సనాపై వరుసగా బాంబ్ దాడులు చేస్తోంది. సనలోని ముఖ్యమైన స్థావరాలను నేటమట్టం చేసింది. దాడులు ప్రతి దాడులతో తూర్పు ఆసియా దేశాలు అల్లకల్లోలంగా మారుతున్నాయి. ఈనెల 17న హౌతీ తిరుగుబాటు దారులు చేసిన దాడులకు ప్రతీకారాన్ని సౌదీ బలగాలు తీర్చుకున్నాయి. శిబిరాలు ప్రధాన కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేయడంతో 25 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రెబల్స్ మిలిటరీలోని అత్యున్నత అధికారి హౌతీల ఏవియేషన్ కాలేజీ మాజీ హెడ్ అబ్దుల్లా ఖాసిమ్ అల్ జునైద్ ఇంటిని లక్ష్యంగా వైమానిక దళం జరిపిన దాడుల్లో జునైద్ ఆయన భార్య 25 ఏళ్ల కుమారుడు సహా 20 మంది పౌరులు చనిపోయినట్లు హౌతీ మీడియా తెలిపింది.అయితే సౌదీ ప్రయోగించిన 8 డ్రోన్లను అడ్డుకున్నట్లు సంకీర్ణ దళాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమిలో యూఏఈ యూడా ఉంది.  ఈ యుద్ధ వాతావరణాన్ని చల్లబర్చడానికి అంతర్జాతీయ వేదికపై కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అవి సక్సెస్ కావడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారు జామున మళ్లీ దాడులు తీవ్రమయ్యాయి. సౌదీలోని దహ్రాన్ అల్ జనుబ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ బాంబులు వేశారు. అయితే వారి ప్రయత్నాలను విఫలం చేసినట్లు అరబ్ సంయుక్త బలగాలు తెలిపాయి.

Related Posts