YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విగత జీవుల్లా చిరుతలు

విగత జీవుల్లా చిరుతలు

అడవిలో రాజులా బతికే చిరుతలు విగత జీవులుగా మారుతున్నాయి.. ఆహారానికి ఆరుబయటకొచ్చి ప్రమాదాల్లో చిక్కుకొంటున్నాయి.. ఐదు నెలల్లో నాలుగు మృత్యుఒడికి చేరుకొన్నాయి.. వన్యప్రాణులకు రక్షణ కరవవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో గతేడాది 27 సాసర్‌పిట్లు, ఈసారి 10 వరకు నిర్మించారు. ఆర్మూర్‌ డివిజన్‌లో ఆర్మూర్‌, కమ్మర్‌పల్లి, సిరికొండ రేంజ్‌లున్నాయి. వీటి పరిధిలో గతంలో 80 సాసర్‌ పిట్లు, కొత్తగా 10 నిర్మించారు.  కామారెడ్డి డివిజన్‌లో కామారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట్‌ రేంజ్‌లున్నాయి వీటిలో పాతవి 83 సాసర్‌ పిట్లు ఉన్నాయి. కొత్తగా 35 నిర్మించారు. బాన్సువాడ డివిజన్‌లో బాన్సువాడ, పిట్లం, జుక్కల్‌, గాంధారి రేంజ్‌లో 25 సాసర్‌ పిట్లు ఉన్నాయి. అసలు వీటిలో నీరు పడుతున్నారా అనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న జాతీయ రహదారిపైన  వేగాన్ని నియంత్రించే వ్యవస్థ  లేకపోవడంతో....ప్రమాదాలు కొనసాగుతున్నాయి. స్పీడ్ కంట్రోల్  చేస్తే వాహనాల వేగం తగ్గుతుంది. జంతువులకు ప్రమాదం జరగకుండా ఉంటుంది. వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులుఅడవిలో జంతువులు సంచరించే ప్రాంతాన్ని రిజర్వు జోన్‌గా గుర్తించాలి. ఇలా చేయడం వల్ల వాహనాల వేగానికి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది.  వన్యప్రాణులు సంచరిస్తున్న ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా ‘జంతువులు సంచరించే ప్రదేశం’ అని బోర్డులు ఏర్పాటు చేయాలి.   ః ఆయా మార్గాల్లో స్పీడ్‌బ్రేకర్లుఏర్పాటు చేయాలి.వేసవి కాలంలో చుక్కనీరు దొరకడం కష్టం..నీటి కోసం అటవీ జంతువులు ఆరుబయటకు రాకుండా సాసర్‌పిట్లలో నీటిని నింపాలి. అటవీ ప్రాంతంలో ఏఏ జంతువులు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఉమ్మడి జిల్లాలో దట్టంగా ఉన్న అటవీ ప్రాంతంలో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గతంలో గుర్తించారు. అధికారులు ఆ దిశగా అడుగులు వేయాలి.

Related Posts