హైదరాబాద్ జనవరి 24
తెలంగాణలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి ఇవ్వవచ్చునంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్నారని సమాచారం.. తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో విధ్యాబోధన ఉంటుందని, కొవిడ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణలో 20 శాతానికిపైనే పాజిటివ్ రేటు ఉందని, మరో పదిరోజుల్లో థర్డ్ వేవ్ ముగిసే అవకాశం ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు, ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవచ్చునని సీఎం కేసీఆర్‌కు వైధ్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. దీనిపై అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్షిస్తున్నారు. మంగళవారం అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరపనున్నారు.