వేములవాడ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం నాడు వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. భక్తులు కోరిన కోర్కెలు తీరాలని ఎములాడ రాజన్నను మనస్పూర్తిగా వేడుకుంటున్నా. దక్షిణ కాశీగా పేరున్న వేములావాడలో భక్తులు ఎదుర్కొనేవి ఇన్ని సమస్యలా ? తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారుతోందా? అనే బాధ కలుగుతోంది.ఎములాడకు రూ.200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు ఏమైనయ్? మేడారం జాతర సమయం దగ్గరకు వస్తున్నా....ఎందుకు పట్టించుకోవడం లేదు?ఈ ఒక్క రోజే లక్ష మంది భక్తులు దర్శనం చేసుకున్నరు.
వేములాడలో భక్తుల రద్దీ, సౌకర్యాల కల్పనపై చిత్తశుద్ధి ఏదని అయన ప్రశ్నించారు. సీఎంకు కనీసం సమీక్ష కూడా చేయలేని దౌర్భాగ్యంలో ఉన్నారా? సీఎం గారూ... మీరు గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయ్? గతంలో ప్రతి దానికి ఆంధ్రోళ్ల పేరు చెప్పి తప్పించుకున్నవ్ కదా..... ఈరోజు భక్తులు పడుతున్న ఇబ్బందులకు ఏం చెబుతావ్? నేను ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి వేములాడ దేవస్థాన అభివృద్ధి కోసం అధికారులను ప్రతిపాదనలు ఇవ్వాలని అడుగుతూనే ఉన్నానని అన్నారు. ప్రసాదం స్కీం కింద వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెబుతూనే ఉన్నా. ప్రశాంతంగా దర్శనానికి వస్తే... భక్తులకు ఇన్ని ఇబ్బందులా ? వేములవాడ ఆలయ నిధులను వాడుకుని దేవుడికే శఠగోపం పెడుతున్న వ్యక్తి కేసీఆర్ . రాజన్న పవర్ ఫుల్ దేవుడు... ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ల సంగతి ఆయనే చూసుకుంటడుని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.