YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణకు మంచి బడ్జెట్..?

తెలంగాణకు మంచి బడ్జెట్..?

హైదరాబాద్, జనవరి 25,
భారతీయ జనతా పార్టీ కేంద్ర బడ్జెట్‌ను ఎప్పుడో ఎన్నికల లక్ష్యాల కోసం వినియోగించడం ప్రారంభించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏటా బడ్జెట్ పెట్టిన సమయంలో ఆ ఏడాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎన్నికలు జరగనున్నాయో..ఆయా రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఉంటారు. కర్ణాటకలో .. కేరళలో ఎన్నికలున్నప్పుడు అక్కడి మెట్రోలకు.. ఇతర రాష్ట్రాల్లో మెట్రోలు ఉంటే మెట్రోలు.. లేకపోతే కేంద్ర ప్రాజెక్టులు ప్రకటిస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన నిధులు ఎంత వరకు రిలీజ్ అవుతాయన్నదానిపై క్లారిటీ లేదు. ఎప్పుడూ లెక్కలు చెప్పలేదు. ఈ లెక్కన తెలంగాణలో ఈ ఏడాది ముందస్తు ఎన్నికలు వస్తాయనీ బీజేపీ గట్టిగా నమ్ముతోంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు ఉంటాయని.. సిద్ధం కావాలని స్వయంగా అమిత్ షా కూడా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో పట్టు సాధించడానికి స్కోప్ ఉందన్న ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉందన్న అంచనా ఉంది. మెట్రో విస్తరణ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.. ఇక కేంద్రం తరపున చేయాలనుకుంటే.. లక్ష కోట్ల సాయం చేయదగిన ప్రాజెక్టులున్నాయి. వీటిలో కొన్నింటికైనా కేంద్రం నిధులు మంజూరు చేస్తూ బడ్జెట్‌లో పెడితే గుర్తింపు ఇచ్చినట్లవుతుంది. రాష్ట్ర బీజేపీ నేతలకు ఎంతో ఉత్సాహం వస్తుంది. అందుకే బడ్జెట్‌లో తెలంగాణకు ఇవ్వబోయే ప్రయోజనాలపై బీజేపీ తెలంగాణ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Posts