YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పట్టు కోసం గట్టి ప్రయత్నాలు

 పట్టు కోసం గట్టి ప్రయత్నాలు

హైదరాబాద్, జనవరి 25,
తెలంగాణలో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి రానున్న కాలమూ గడ్డుపరిస్థితులు తప్పేట్లు లేవు. తాము అధికారంలోకి వస్తామన్న ఆశను పక్కనపెడితే బీజేపీ కంటే మెరుగైన పనితీరును కనబరుస్తామన్నది కూడా అత్యాశగానే మారనుందేమో. అదే ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో అంతర్మధనానికి దారితీస్తుంది. నిజానికి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత కాంగ్రెస్ లో కొంత జోష్ కన్పించింది. రేవంత్ పీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టడంతో అధికార పార్టీలో కూడా కొంత కలవరం మొదలయింది. అయితే కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీ ఇంకా కోలుకోలేని స్థితిలోనే ఉందని చెప్పాలి. ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవించరు. ఒకరు అవునంటే మరొకరు కాదంటారు. అసలు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికే సవాలక్ష సవాళ్లను రేవంత్ రెడ్డి ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టని బలోపేతం చేయడం ఎలా? అన్న దానిపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ వ్యవహారా ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ సయితం గత కొద్ది నెలలుగా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు తాజాగా ఇండియా టుడే - సీ ఓటర్ మూడ్ ఆఫ‌ ది నేషన్ సర్వే ఫలితాలు కాంగ్రెస్ ను మరింత నిరాశలోకి నెట్టాయి. ఈ సర్వేలో కాంగ్రెస్ 2019 లో గెలిచిన మూడు స్థానాల్లో ఒక స్థానాన్ని కోల్పోయే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో బీజేపీ గతంలో గెలిచిన నాలుగు స్థానాలతో పాటు మరో రెండు స్థానాలను అదనగం గెలస్తుందని, అధికార టీఆర్ఎస్ ఒకస్థానాన్ని కోల్పోయి ఎనిమిది స్థానాలను గెలుస్తుందని సర్వే ఫలితాలు వెల్లడయించాయి. కాని ఆ సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అని చేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు కొంత ఊరట చెందారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముందు జరుగుతాయి. తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశముంది. శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా వ్యక్తమవుతుందని, శాసనభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు విశ్వసించరని, తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, గత ఎన్నికల్లో బీజేపీకి ఒక్కస్థానం మాత్రమే వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. అందరూ నేతలు ఏకమైతేనే కొద్దో గొప్పో పట్టు దొరుకుతుంది. లేకుంటే ఏపీ తరహాలో ఇక్కడా పార్టీకి భవిష‌్యత్ లో నేతలు కరవవుతారు.

Related Posts