YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

183 గ్రామపంచాయితీలకు మంచినీరే

183 గ్రామపంచాయితీలకు మంచినీరే

ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామ ప్రజల దాహం శాశ్వతంగా తీరుతున్నది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగర పాలక సంస్థ పరిధిలో సమృద్ధిగా తాగునీరిందడమే లక్ష్యంగా అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా జలమండలి రూ. 628కోట్లతో తాగునీటికి పథకానికి శ్రీకారం చుట్టారు. గత అక్టోబరులో పనులు ప్రారంభించిన అధికారులు రాబోయే సెప్టెంబరులోగా పూర్తి చేయాలని ప్రాజెక్టు విభాగం అధికారులకు ఎండీ దానకిశోర్ దిశానిర్థేశం చేశారు.మూడు జిల్లాల పరిధిలోని 12 మండలాల్లో రూ. 628 కోట్లతో అర్బన్ మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఔటర్ లోపలి గ్రామాలన్నింటికీ శాశ్వతంగా నీటిఎద్దడి తీర్చడానికి జలమండలి గత అక్టోబర్‌లో పనులు చేపట్టింది. ఈ సెప్టెంబర్‌లో వీటిని పూర్తి చేయాలని ఎండీ దానకిశోర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. బోర్ నీటిపై ఆధారపడిన 58 గ్రామాల్లో ఇప్పటికే రిజర్వాయర్ల నిర్మాణం, పైపులైన్ విస్తరణ పనులు చేపట్టి నీటి సరఫరా ప్రారంభించారు. దశలవారీగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 183 గ్రామ పంచాయతీలలో సమృద్ధిగా తాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా లక్షన్నర నల్లా కనెక్షన్లు మంజూరుచేసి, రోజూ 30 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత పూర్తిగా బోర్ నీటిపైన అధారపడిన గ్రామాలను గుర్తించి పనులను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే విడతల వారీగా ఆయా గ్రామాలకు సమృద్ధిగా తాగునీరు అందించిన అధికారులు నాలుగు రోజుల క్రితం 58 గ్రామాలకు నీటిసరఫరా ప్రారంభించారు. ఇందులో భాగంగానే రెండో విడతగా పైపులైన్ విస్తరణ, సర్వీస్ రిజర్వాయర్ల పనులను వేగిరం చేశా రు. ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షిస్తూ పనుల్లో వేగం పెంచేలా ఎండీ దానకిశోర్ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పది లక్షల జనాభా కు రోజూ 30 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా అందించనున్నారు. నూతనంగా లక్షన్నర కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Related Posts