YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

టెన్త్ టెన్షన్ తీరేదెలా...

టెన్త్ టెన్షన్ తీరేదెలా...

వరంగల్, జనవరి 25,
ఈ ఏడాదీ టెన్త్‌ టెన్షన్‌ పట్టుకుంది. ప్రస్తుత విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం వరుసగా దసరా, క్రిస్మస్‌ సెలవులు రావడం, అనంతరం నెల రోజుల పొడవునా ఉపాధ్యాయుల బదిలీల గొడవ, మొన్నటివరకు సంక్రాంతి సెలవులు.. థర్డ్‌వేవ్‌ పుణ్యమా అని వాటి పొడిగింపు.. పర్యవసానంగా ఈ ఏడాదీ పదోతరగతి చదువులు చట్టుబండలే అవుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50శాతం సెలబస్‌ కూడా పూర్తికాలేదు. ఆన్‌లైన్‌ పేరుతోనో.. అదనపు తరగతుల పేరుతో ప్రయివేటులో కనీసం 65 నుంచి 70శాతం వరకు సిలబస్‌ పూర్తయింది. ఏదేమైనా రెండేండ్లుగా ప్రభుత్వం టెన్త్‌ విద్యార్థులను పరీక్షలు రాయకున్నా.. పాస్‌ చేస్తున్న క్రమంలో ఈ ఏడాదీ థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో కరోనా పాస్‌ అవుతామా? అన్న ఆందోళనలు విద్యార్థుల్లోనూ, అటు వారి తల్లిదండ్రుల్లో నెలకొంది.ఈ విద్యాసంవత్సరం సెప్టెంబర్‌లో ఆలస్యంగా తరగతులు ప్రారంభమయ్యాయి. మొదట్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా నమోదుకాగా అయినా పాఠాలు సాగాయి. ఈలోపు దసరా సెలవులు వచ్చాయి. సెలవుల అనంతరం గాడిన పడిందనుకున్న సమయంలోనే డిసెంబర్‌లో కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ షురూ అయింది. తమ పోస్టింగ్‌ల్లో అన్యాయం జరుగుతుందని ఆందోళన బాటపట్టడంతో ఈ నెలంతా టెన్త్‌సెలబస్‌ జోలికి పోలేదు. దాంతో ఏ ఒక్క సర్కారు బళ్లో కూడా సరిగ్గా పాఠాలు సాగలేదు. ఉపాధ్యాయుల అభ్యంతరాలు ముగిసి వారికి కేటాయింపులు పూర్తయ్యేనాటికి సంక్రాంతి పండుగ సెలవులు వచ్చాయి. అవి ఏకంగా 14 రోజులపైనే తొలుత ప్రకటించినా.. కరోనా థర్డ్‌వేవ్‌ ముంచుకొచ్చింది. ప్రభుత్వం పాఠశాలల మూత అని నేరుగా చెప్పకుండా ఈనెలాఖరు వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించిన సర్కారు ఇక భౌతిక తరగతులకు స్వస్తి పలకనున్నట్టు తెలుస్తోంది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,952 ప్రభుత్వ పాఠశాల ల్లో 2,89,573 మంది విద్యార్థులు చదువుతు న్నారు. అందులో పదో తరగతి విద్యార్థులు 29,950 మంది ఉన్నా రు. జిల్లాల వారీగా పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలోని 1141 పాఠశాలల్లో 1,48,293 మంది విద్యార్థులు చదువు తుండ గా.. పదోతరగతి విద్యార్థులు 11,792 మంది ఉన్నారు. కరీంనగర్‌ జిల్లాలో 704 ప్రభుత్వ పాఠశాలల్లో 53,800 మంది విద్యార్థులుండగా.. వారిలో 8,217 మంది టెన్త్‌ స్టూడెంట్స్‌ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో576 ప్రభుత్వ పాఠ శాలల్లో 46,391 మందివిద్యార్థులుండగా పదోతరగతి విద్యార్థులు 3,593 మంది చదువుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 531 సర్కారు బడుల్లో 41,089 మంది విద్యార్థులు చదువుతుండగా.. అందులో పదో తరగతి విద్యార్థులే 6,348మంది ఉన్నారు. ఇప్పుడు వీరంతాపదోతరగతి పరీ క్షలు జరుగుతాయో లేదోనన్న మీమాంసలో ఉన్నారు. దాని కితోడు సిలబస్‌ సైతం సగం కూడా పూర్తవలేదు. మరోవైపు నేటి నుంచి ప్రభుత్వం ఆన్‌ లైన్‌ తరగతులను ప్రారంభిం చింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల్లో మెజార్టీ సంఖ్యకు కనీసం స్మార్ట్‌ ఫోన్లు లేవు. 2019 మార్చి నుంచి మొదలైన కరోనా వేవ్‌ మూడేండ్లుగా పట్టిపీడిస్తోంది. ఏడాది క్రితం వరకూ ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన బలహీనవర్గాల కుటుంబాల్లో పిల్లల చదువు మోయలేని భారంగా మారింది. ఇప్పుడిప్పుడే కోలు కుంటున్న దశలో మళ్లీ థర్డ్‌వేవ్‌ రావడం, ఆన్‌లైన్‌ తరగతు లను ప్రభుత్వమే మొదలు పెట్టడం పర్యవసానంగా సర్కారు విద్యాసంస్థల్లోని పిల్లలు ఈ ఏడాది కూడా చదువుకు దూరం కానున్నారు.

Related Posts