YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నాయకుల మధ్య జెండా వార్..

నాయకుల మధ్య జెండా వార్..

తాడిపత్రి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జాయ్ (జెసి)పార్క్ లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడానికి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి  ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పార్క్ లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వరాదని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేయడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై  మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. తాను నిర్మించిన పార్కు కు రిజిస్ట్రేషన్ ఉందని అన్ని ఖర్చులు బ్యాంకు ద్వారా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదన్నారు. ప్రతి ఏడాది పార్కు సంబంధించి ఆడిట్ చేస్తున్నామన్నారు .ఇటీవల ఎమ్మెల్యే నిర్మిస్తున్న పార్కు కు రిజిస్ట్రేషన్ ఉందా అని ప్రశ్నించారు. రిపబ్లిక్ డే  రోజు పార్క్ లో జెండా ఎగిరేవేయకుండా చూడాలని అధికారులను బెదిరించడం, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చేస్తే వారు సమావేశానికి వెళ్లవద్దని అధికారులు బెదిరింపులు చేయడం ఎమ్మెల్యే కి సరికాదన్నారు. అధికారులు ఎదురు తిరిగితే తట్టుకోలేరన్నారు. ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారని అధికారాన్ని ఉపయోగించి తాడిపత్రి అభివృద్ధికి కృషి చేస్తే సహకరిస్తామని హితవు పలికారు. మిమ్మల్ని గౌరవించినట్లు మీ కుటుంబ సభ్యులను గౌరవించాలనుకోవడం మీ అనైతిక చర్యలకు నిదర్శనమన్నారు. నేను అనుకుంటే మీ తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోలేవని ఎమ్మెల్యే ఉద్దేశించి పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రిపబ్లిక్ డే రోజు జెండా ఎగురవేసి తీరుతామని జేసి తెలియజేశారు.

Related Posts