YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త్వరలో సింగిల్ సైన్ ఆన్ ఐడీ

త్వరలో సింగిల్ సైన్ ఆన్ ఐడీ

న్యూఢిల్లీ, జనవరి 25,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకం లేదా సేవల ప్రయోజనాన్ని పొందడానికి ప్రస్తుతం ఓ డిజిటల్ ప్రొఫైల్ సిద్ధమవుతోంది. దీంతో అన్ని పథకాలు, సేవలను ఓకే ఐడీతో పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. దీనికి ‘సింగిల్ సైన్ ఆన్’ అని పేరు పెట్టారు. ఇది పౌరుల ధృవీకరణ ప్రక్రియ. దీనిలో అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఒకే ఐడీ ద్వారా పొందవచ్చు. అంటే, ధృవీకరణ కోసం మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదు.వివిధ సేవలు, ప్లాన్‌లతో కనెక్ట్ కావడానికి మల్టిఫుల్ లాగిన్ ఐడీ-పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవలసిన అవసరం ఇకపై ఉండదు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని పథకాలు/ఫీచర్ల ఏకీకరణ కోసం పోర్టల్/యాప్ తయారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ఒకసారి నమోదు చేసుకుంటే చాలు. ఆపై ఏ పథకానికైనా జీవితాంతం ఇదే ఐడీతో పొందవచ్చు.ఒకే చోట అనేక సౌకర్యాలు అందుబాటులోకి.. ఈ సరికొత్త పథకం అందుబాటులోకి వచ్చిన తరువాత అన్ని సేవలు ఒకే చోట పొందవచ్చు. పాఠశాల, కళాశాల అడ్మిషన్, విద్యా సర్టిఫికేట్, విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు, రైల్వే-విమాన టిక్కెట్, ఇంటి పన్ను చెల్లింపు, ఆదాయపు పన్ను రిటర్న్, జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్, వ్యాపార అనుమతి సంబంధిత సౌకర్యాలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. స్కాలర్‌షిప్ దరఖాస్తు, వ్యాపార ఆమోదం, స్టార్టప్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రానున్నాయి.కేవైసీ, డిజిలాకర్ కూడా.. బ్యాంకింగ్ సేవల కోసం ఉపయోగించే కేవైసీ కూడా దీనికి లింక్ చేయనున్నారు. ప్రభుత్వం ఈ సదుపాయంతో డిజిలాకర్‌ను కూడా అనుసంధానిస్తుంది. తద్వారా దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్ కాపీ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్‌ను మెరుగుపరచడంలో ఇది విప్లవాత్మక అడుగు అని పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఎందుకంటే ఎస్ఎస్వో సేవ అతిపెద్ద ప్రయోజనం వ్యాపారవేత్తలు వ్యవస్థాపకులకు అందుబాటులోకి అన్ని సౌకర్యాలను తీసుకరావడమేనని పేర్కొన్నారు.ప్రస్తుతం, వారు వ్యాపారాన్ని ప్రారంభించడానికి వివిధ రకాల అనుమతుల కోసం వివిధ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు, రాజస్థాన్ ప్రభుత్వం మాత్రమే దేశంలో రాష్ట్ర స్థాయిలో తన పథకాలకు ఎస్ఎస్వో అంటే సింగిల్ సైన్ ఆన్ ఐడీని తప్పనిసరి చేసింది. పౌర స్థాయిలో, న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ దాని సౌకర్యాలను పొందేందుకు పౌరులకు ఎస్ఎస్వో సౌకర్యాన్ని అందించింది.పాస్‌పోర్ట్ నుంచి గ్యాస్ కనెక్షన్ వరకు..పాస్‌పోర్ట్, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, గ్యాస్ కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, వివాహం-జనన-మరణ ధృవీకరణ పత్రం, పీఎఫ్, ఆర్మ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ వంటి పత్రాలు అన్నీ ఒకే యాప్‌లో ఉంటాయి. చాలా వరకు జారీ చేయడానికి, వివిధ కార్యాలయాల యాప్ లేదా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వేర్వేరు వెబ్‌సైట్‌లలో వేర్వేరు లాగిన్‌లు, పాస్‌వర్డ్‌లు ఉపయోగిస్తున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తరువాత మీరు ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు.సేవా ఫారమ్‌లోని మొత్తం వివరాలు యూజర్లే అందించి, రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫారం చాలా కీలకంగా మారనుంది. ఫారమ్ తెరవగానే దరఖాస్తుదారునికి సంబంధించిన మొత్తం సమాచారం ఆటోమేటిక్‌గా వివిధ కాలమ్‌లలో నిండుతుంది. దీనికి కేవలం ‘ఓకే’ బటన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.

Related Posts