YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగ సంఘాల భారీ ర్యాలీ

ఉద్యోగ సంఘాల భారీ ర్యాలీ

విజయవాడ
రివర్స్ పిఆర్సి జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉద్యోగ సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఉద్యోగులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో తాము అంతర్భాగమైన అన్న విషయాన్ని గుర్తు ఎరగాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అశుతోష్ మిశ్రా నివేదికను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు ఈరోజు నిరసన ర్యాలీ పిలుపునిచ్చాయి. వచ్చే నెల ఏడో తేదీ నుంచి సమ్మెకు దిగుతున్న నేపథ్యంలో ఐక్య కార్యాచరణ సమితి మంగళవారం విజయవాడలో నిరసన ర్యాలీ చేపట్టింది. పాత బస్టాండ్ నుంచి ధర్నా చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు. పాత పీఆర్సీని అమలు చేయాలని, కొంతమంది ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల జీతాలు తగ్గించడం ఏమిటంటూ వారు ప్రశ్నించారు. పనికి తగ్గ వేతనం ని మాత్రమే తాము తీసుకుంటున్నామని, సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ఉద్యోగులను కించపరిచే రీతిలో ప్రచారం చేయడం బాధాకరమని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులే ముందు ఉన్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని, చీకటి జీవోలను రద్దు చేసి పాత పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Related Posts