హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ తో టి- కాంగ్రేస్ బృందం భేటీ ముగిసింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ * రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాము. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ర్ వైఫల్యం చెందింది. పోలీసులను వాళ్ళ పనులను టీఆరెస్ నేతలు చేయనియ్యడం లేదు. వనమా రాఘవా దాష్టికమ్- రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథని లో అద్వకేట్ హత్య, శీలం రంగయ్య ఘటనలు గుర్తు చేసాము. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పోలీస్ శాఖపై గవర్నర్ సమీక్ష చేయాలని కోరామని అన్నారు. టీఆరెస్ ప్రభుత్వంలో పోలీస్ - పోలీస్ లాగా పనిచేయడం లేదు. పోలీస్ నుంచి రక్షణ ఉంటది అనే భావన ప్రజలు కోల్పోయారు. టీఆరెస్ నాయకులు చెప్తేనే పోలీస్ దగ్గర న్యాయం జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం పోలీస్ తన విధులు తను విధించాలి. ఒత్తిళ్లకు లొంగోద్దని అయన అన్నారు.