YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్తంభించిన కాకినాడ నగరఅభివృద్ధి డ్రైన్లు కల్వర్టులు నిర్మించాలి

 స్తంభించిన కాకినాడ నగరఅభివృద్ధి  డ్రైన్లు కల్వర్టులు నిర్మించాలి

కాకినాడ
కార్పోరేషన్ ఆర్థిక మాంద్యం రీత్యా నగరం లో అభివృద్ధిపనులు నిలిచిపోయాయని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నా రు. రు.2కోట్ల అంచనా తో 6నెలల క్రిందట టి టి డి జంక్షన్ నుండి మొదలు పెట్టిన ఓపెన్ డ్రెయిన్ల నిర్మాణం తహశీల్దార్ కార్యా లయం వద్దనే ఆగి పోయిందన్నారు. క్రుంగిపోయిన  జగన్నాధపురం ఎన్ టి ఆర్ బ్రిడ్జి ఎప్రోచ్ రోడ్డు పునః నిర్మాణం చేపట్ట డం లేదన్నారు. దేవాల యం వీధి ఎప్రోచ్ రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంద న్నారు.  నగర వ్యాప్తం గా ఎత్తైనసిమెంటు రోడ్లు నిర్మించిన 85 శాతం వీధుల్లో డ్రైన్లు క్రాస్ కల్వర్టుల పునః నిర్మాణం పనులు  చేయకుండా గాలికొదిలే సారన్నారు. రాబోయే వర్షాలకు ముందస్తుగా వేసవిలో ముంపు  మురుగు నీరు పారే అవుట్ లెట్స్ ప్రణాళిక తో నగర వ్యాప్తంగా డ్రైన్లు క్రాస్ రోడ్ల కల్వర్ట్లు నిర్మించాల్సిన  అజెండా చేపట్టాలని కోరారు. మున్సిపల్ మంత్రి రాక తరువాత జోరుగా జరగాల్సిన  అభివృద్ధి పనులు నిధుల లేమితో నిలిచిపోవడం శోచనీయంగా వుందన్నారు. మట్టి ఫిల్లింగ్ సచివాలయ నిర్మాణ సామగ్రి ఇతర శాఖల పనులకు ప్రభుత్వం కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ నుండి బదలాయించు కున్న రు.150కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను బకాయి రు.65 కోట్లు వసూలు చేయా లని డిమాండ్ చేశారు.

Related Posts