YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శివసేన, బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌

శివసేన, బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌

ముంబై, జవనరి 25,
శివసేన, బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. కమలం పార్టీపై ఒంటి కాలితో లేస్తున్నారు శివసేన లీడర్లు. అసలు బీజేపీకి ప్రధాని పదవిని తామే ఇచ్చామని అంటున్నారు శివసేన నేతలు. బీజేపీ కూటమి ఎన్డీయేలో తమ పార్టీ 25 ఏళ్ల కాలాన్ని వృథా చేసిందన్నారు శివసేన సుప్రీం ఉద్ధవ్ ఠాక్రే. శివసేన హిందుత్వానికిఅధికారం అందించేందుకు బీజేపీతో జతకట్టిందని, కానీ అధికారం కోసం హిందుత్వాన్ని ఎన్నడూ వాడుకోలేదన్నారు ఉద్ధవ్.అధికారం కోసం మిత్రులను వాడుకుని వదలేసే అవకాశవాదం బీజేపీకే ఉందని ఘాటుగా విమర్శించారు మహా సీఎం. జాతీయ స్థాయిలో ఉండాలనుకున్న బీజేపీ లక్ష్యానికి తాము సహకరిస్తే, తమను వెన్నుపోటు పొడిచిందని ఫైర్‌ అయ్యారు ఉద్ధవ్. బీజేపీని వీడినప్పటికీ, హిందుత్వాన్ని తమ పార్టీ వదులుకోలేదని స్పష్టం చేశారాయన. భవిష్యత్తులో శివసేన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.సీఎం ఉద్ధవ్‌ కామెంట్స్‌ను సపోర్ట్‌ చేశారు శివసేన కీలక నేత సంజయ్‌ రౌత్. ప్రధాని పదవిని చేపట్టే అవకాశం తమకు వచ్చినా, తామే బీజేపీకి వదిలిపెట్టామన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. హిందుత్వ సిద్ధాంతాన్ని శివసేన ఎప్పుడూ అధికారం కోసం వాడలేదంటూ ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధించారు సంజయ్. మహారాష్ట్రలో ఎక్కడో అడుగున ఉన్న బీజేపీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ఘనత శివసేనదేనని స్పష్టం చేశారు. బాబ్రీ ఉదంతం తర్వాత నార్త్‌ ఇండియాలో శివసేన పవనాలు బలంగా వీచాయని, అలాంటి దశలోనే తాము ఎన్నికలకు వెళ్లి ఉంటే శివసేన నేతనే ప్రధాని అయ్యేవారని కామెంట్‌ చేశారు సంజయ్. శివసేన కామెంట్స్‌ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి మరి.

Related Posts