YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోనసీమ సెంటిమెంట్ పోయినట్టేనా

కోనసీమ సెంటిమెంట్ పోయినట్టేనా

కాకినాడ, జనవరి 27,
అతి పెద్దదైన తూర్పు గోదావరి జిల్లా ఇక మూడు జిల్లాలుగా మారబోతుంది. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంటు నియోజకవర్గాలు తూర్పు గోదావరి జిల్లాలో ఉండేవి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలను సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉండేది. ఇక తూర్పు గోదావరి జిల్లా మూడు జిల్లాలుగా కానుంది. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు కాబోతున్నాయి. అమలాపురం జిల్లాకు కోనసీమ జిల్లాగా పేరు పెట్టనున్నారు. ఈ జిల్లా పరిధిలో రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం, ముమ్మడివరం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అలాగే కాకినాడ జిల్లా కేంద్రంగా తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాలుంటాయి. రాజమండ్రి జిల్లా కేంద్రంగా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలుంటాయి. ఇప్పటి వరకూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు రాష్ట్ర రాజకీయాలను శాసించేవి. ఇకపై ఆ మాట వినపడే అవకాశం లేదు. ఈరెండు జిల్లాలు మొత్తం ఐదు జిల్లాలుగా మారాయి. ఏలూరు జిల్లా కేంద్రంగా ఏలూరు, దెందులూరు, చింతలపూడి, కైకలూరు, ఉంగుటూరు, పోలవరం, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. భీమవరం జిల్లా కేంద్రంగా పాలకొల్లు, ఉండి, నరసాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం నియోజకవర్గాలుంటాయి.
నేతలకు ఘన నివాళి
ఎన్టీఆర్ పేరిట కొత్త జిల్లా ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తొలుత ఇచ్చిన హామీని అమలు పర్చారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును పెట్టాలని నిర్ణయించారు. ఈ జిల్లాలో విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలను చేర్చారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. అలాగే కృష్ణా జిల్లా... కృష్ణా జిల్లా పేరును తొలగించవద్దని కొందరు చేసిన సూచనల పరిగణనలోకి తీసుకుని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న జిల్లాకు కృష్ణా జిల్లా పేరును కంటిన్యూ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో పెడన, అవనిగడ్డ, పామర్రు, మచిలీపట్నం, పెనమలూరు, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలను చేర్చనున్నారు. కృష్ణా నదికి ప్రాముఖ్యత ఉండటంతో ఆ పేరును మచిలీపట్నం కేంద్రంగా ఉండే జిల్లాకు ఉంచనున్నారు.  అల్లూరి సీతారామరాజు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుకానుంది. పాడేరు కేంద్రంగా ఈ కొత్త జిల్లా ఏర్పాటు కాబోతుంది. ఈ జిల్లా పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలను చేర్చారు. ఇక పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ జిల్లా పరిధిలో పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. గిరిజనులు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో రెండు జిల్లాలు కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి.ఇక మహనీయులు పొట్టి శ్రీరాములు పేరును అలాగే ఉంచుతారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా ఉండే ఈ జిల్లాలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలుండనున్నాయి. ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం పొట్టి శ్రీరాములు జిల్లాలోకి వెళ్లనుంది. వైఎస్సార్ జిల్లాను కూడా అలాగే ఉంచనున్నారు. కడప కేంద్రంగా ఉండే ఈ జిల్లాలో కడప, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలు ఉండనున్నాయి.
3 జిల్లాలకు దేవుళ్ల పేర్లు
కొత్త జిల్లాల ఏర్పాటుకు చేసిన కసరత్తును పక్కన పెడితే జగన్ ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలకు దేవుళ్ల పేర్లు పెట్టింది. మూడు జిల్లాలకు ప్రజలు తమ దేవుళ్లుగా భావించే వారి పేర్లను పెట్టింది. కొందరు దేవుళ్లు అనడానికి అభ్యంతరం చెప్పవచ్చు కాని, మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ఈ పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఏర్పడబోతున్న జిల్లాకు బాలాజీ జిల్లాగా, రాయచోటి కేంద్రంగా ఏర్పడుతున్న జిల్లాకు అన్నమయ్య జిల్లాగా, పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడుతున్న జిల్లాకు సత్యసాయి జిల్లాగా నామకరణం చేశారు. ఇందులో తిరుపతి కేంద్రంగా ఏర్పడుతున్న బాలాజీ జిల్లాలో సర్వేపల్లిని మినిహాయించారు. సర్వేపల్లి గతంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండేది. సర్వేపల్లి నియోజకవర్గం మినహా తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు చిత్తూరు పార్లమెంటు నియోకవర్గం పరిధిలోని చంద్రగిరి అసెంబ్లీని కలిపి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఇక అన్నమయ్య జిల్లాకు కూడా విశిష్టత ఉంది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్న పుంగనూరును చిత్తూరు జిల్లాలో కలిపారు. అలాగే రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.ఇక పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న జిల్లాకు సత్యసాయి జిల్లాగా నామకరణం చేయనున్నారు. పుట్టపర్తి సత్యసాయి ఉన్న ఊరు కావడంతో ఆయన పేరిట జిల్లా ఏర్పాటు కాబోతోుంది. సత్యసాయి జిల్లా పరిధిలోకి పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. దీంతో మొత్తం మూడు జిల్లాలకు జగన్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న సెంటిమెంట్ ను, అక్కడ ప్రాముఖ్యతలను బట్టి పేర్లను నిర్ణయించింది.

Related Posts