YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఒమిక్రాన్ 21 గంటల పాటు లైఫ్

ఒమిక్రాన్ 21 గంటల పాటు లైఫ్

ముంబై, జనవరి 27,
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గతంలో డెల్టా కంటే మూడింతల వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒమిక్రాన్‌పై తాజాగా జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్టురల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు దీనికి గల కారణాలపై పరిశోధన చేశారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఈ వేరియంట్ వస్తువులపై ఎక్కువ సమయం బతికి ఉండడమే కారణమని తేల్చారు. ఒమిక్రాన్ వేరియంట్ మనిషి చర్మంపై 21 గంటల పాటు బతికి ఉంటుందని తమ అధ్యయనంలో తేలినట్లు సైంటిస్టులు వెల్లడించారు. ప్లాస్టివ్ వస్తువులపై అయితే ఏకంగా ఎనిమిది రోజుల పాటు ఒమిక్రాన్ సజీవంగా ఉంటుందని తేల్చారు. ఈ నేపథ్యంలో జనం.. కొత్త వేరియంట్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, క్రమం తప్పకుండా చేతులు శానిటైజ్ చేసుకోవడం చాలా అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచి తొలుత వచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్‌గా భావిస్తున్న దానితో పోలిస్తే ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల లైఫ్ ప్లాస్టిక్, చర్మంపై చాలా ఎక్కువగా ఉందని గుర్తించినట్లు కేపీ యూనివర్సిటీ సైంటిస్టులు తెలిపారు. తమ స్టడీ వివరాలు బయోరిక్సివ్ సైన్స్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయన్నారు. కొత్త వేరియంట్‌కు ఉన్న హై ఎన్విరాన్‌మెంటల్ సస్టైనబిలిటీ వల్ల కాంటాక్ట్ ద్వారా ఎక్కువ మందికి వైరస్ అంటుకుంటోందని, దీని వల్లే స్ప్రెడ్ చాలా తీవ్రంగా ఉందని, పబ్లిక్ అప్రమత్తతే రక్షణ అని చెప్పారు. సగటున ప్లాస్టిక్ వస్తువులపై వుహాన్ నుంచి వచ్చిన ఒరిజినల్ వేరియంట్‌ లైఫ్ 56 గంటలు ఉంటే,  ఆల్ఫా 191.3 గంటలు, బీటా 156.6 గంటలు, గామా 59.3 గంటలు, డెల్టా 114 గంటలు సజీవంగా ఉన్నట్లు సైంటిస్టులు తెలిపారు. వీటన్నింటికీ మించి ఒమిక్రాన్ వేరియంట్ ఏకంగా 193.5 గంటలు ప్లాస్టిక్ వస్తువులపై బతికే ఉంటోందని వివరించారు. చర్మంపై ఒరిజినల్ వైరస్ 8.6 గంటలు మాత్రమే బతికి ఉంటే, ఆల్ఫా వేరియంట్ 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, గామా 11 గంటలు, డెల్టా 16.8 గంటలు, ఒమిక్రాన్ 21.1 గంటలు లైఫ్‌ను కలిగి ఉన్నాయని సైంటిస్టులు పేర్కొన్నారు.చర్మంపై ఉండే ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను శానిటైజర్ సులభంగా అంతం చేస్తుందని సైంటిస్టులు స్పష్టం చేశారు. 35 శాతం ఇథనాల్ ఉన్న శానిటైజర్ వాడినా కేవలం 15 సెకన్లలోనే వైరస్ ఖతమైతదని పేర్కొన్నారు. ఏదైనా వస్తువులను తాకిన తర్వాత మన చేతులకు వైరస్ అంటుకున్నా శానిటైజర్‌‌తో చంపేయొచ్చని, అందుకే డబ్ల్యూహెచ్‌వో సూచించిన ప్రకారం శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెప్పారు

Related Posts