YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చేనేతకు నైపుణ్యం తోడైతే...?

చేనేతకు నైపుణ్యం తోడైతే...?

కుటీర పరిశ్రమగా చేనేత..

మంచి సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాయి..

ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగితేనే..

తెలంగాణలో సహజంగానే చేనేత కుటీర పరిశ్రమగా ఉంది. నేతలోని వివిధ దశల్లో కుటుంబ సభ్యలంతా పనిచేస్తారు. చేనేత గిట్టుబాటు కాకపోవడంతో యువతరం వేరే రంగాల వైపు వెళ్తోంది. అయితే కుటుంబంలో నేత మీద ఆధారపడిన వారికి ఆకలి బాధలు తప్పడంలేదు. రోజంతా మగ్గంమీద రెక్కలు ముక్కలు చేసుకున్నా డొక్కాడటం లేదు.తెలంగాణ గడ్డ చేనేతకు పెట్టిందిపేరు. రైతన్న తర్వాతి స్థానం నేతన్నదే. అయితే చేనేత గిట్టుబాటు బాటు కాకపోవడంతో చాలామంది నేతన్నలు ఉపాధి కోసం ఇతర పనులు చూసుకుని వలస బాటపట్టారు. కుటుంబానికి ఒకరో ఇద్దరో మిగిలారు ఈ నేపథ్యంలో వారికి మెరుగైన జీవనోపాధుల కోసం ఇక్కడ వస్త్రాల డిజైనింగ్‌,మరియు నేతపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. (ఔూ=ూ,ఔజుఖీుఔIణIచీ+ ూచీణ ుIజు డ ణIజు )ముందుగానే దారాలమీద డిజైన్‌ వెయ్యడం, మగ్గం మీద దారాలు ఏర్పాటు, అద్దకం మొదలైన అనేక అంశాల్లో పేద మహిళలు శిక్షణ పొందారు. 


ఇక్కత్‌ అంటే? 
చేనేతలో ప్రత్యేకమైన శైలి ఇక్కడ .ఈ నేతకు ఇవాళ ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కత్‌ అద్దకం , నేతలో నైపుణ్యాలను మెరుగుపర్చి జీవనోపాధి అవకాశాలు పెంచడానికి నాబార్డు తొలిసారిగా తెలంగాణాలోని నల్గొండ జిల్లాలో ఈ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టింది. సంప్రదాయ వస్త్రాల నేతలో నల్లగొండ జిల్లా నేతకారులకు మంచి సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాయి,వారి ఉత్పత్తులకు డిమాండ్‌ పెంచడానికే ఈ కార్యక్రమం 
శిక్షణ... 
నల్గొండ జిల్లాలో నెమ్మాని, మంద్ర, వెల్లంకి గ్రామాలకు చెందిన 90మంది మహిళలకు 15 రోజుల శిక్షణ ఇచ్చారు. ఇక్కడ నేతకు మార్కెట్లో డిమాండ్‌ ఉంది.స్థానిక అవసరాలకూ ఎగుమతులకూ కూడా మంచి గిరాకీ ఉంది. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చారు. అయితే ముడిసరుకు, మార్కెటింగ్‌ కు సంబంధించి స్థానికంగా ఉండే అవకాశాలనే ప్రధానంగా తీసుకోవడం వల్ల మహిళల ఆదాయం పెరిగి, అంతిమంగా జీవన ప్రమాణాలు మెరుగుపడ్డానికి అవకాశం ఉంది.. 
కేవలం నైపుణ్యాలు పెంచడమే కాకుండా రుణ సదుపాయం పొందడం, మార్కెటింగ్‌ మొదలైన అంశాల్లో కూడా ఎన్‌జీఓ కౌన్సిలింగ్‌ ఇచ్చింది. దీనివల్ల శిక్షణ పొందిన మహిళలకు మంచి లబ్ది చేకూరింది. ఇప్పటికే కొందరు ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించారు. 
ఫలితాలు ఇవి... 
1,ఈ శిక్షణ వల్ల మహిళలు రోజుకు 400రూపాయల నుండి, 6వందల రూపాయల దాకా ఆదాయం సమకూరుతుంది. 
2, గ్రామీణ చేనేత, హస్తకళారుల్లో ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది 
3, తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం 
4, వినియోగ దారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా వినూత్న డిజైన్లు రూపొందిస్తున్నారు. 
5, ఆధునిక పద్దతులు నేర్చుకోవడం , ఆదాయం సమకూర్చుకోవడం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని పైకి తీసుకు రావడం . వారి జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. 
6, సహకార పద్దతి వల్ల సాంకేతిక సామర్థ్యం పెంచడం, వస్త్రాల నాణ్యత మెరుగుపడింది. 
7, గ్రామీణ ఉద్పాదకత పెరిగి, గ్రామీణ మహిళలు, ఉత్పత్తి, మార్కెటింగ్‌ క్రమంలో భాగస్వాములవుతున్నారు. 
మెరుగైన శిక్షణ వల్ల మేలు 
'' ఇక్కత్‌ డిజైన్‌ నేర్చుకోవడం వల్ల మా ఆదాయం గతంలో కంటే పెరిగింది. ఆకులు, పువ్వులు కూరగాయల నుండి రంగులు తియ్యడం, రంగుల అద్దకం నేర్చుకున్నాం. బ్యాంకుల సాయంతో మార్కెటింగ్‌ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం'' అంటారు ఇక్కడ శిక్షణ పొందిన గంజి ఉమ. 

Related Posts