YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీజేపీకి అనుకూల పవనాలు బీజేపీ ఓబీసీ నేత లక్ష్మణ్

బీజేపీకి అనుకూల పవనాలు బీజేపీ ఓబీసీ నేత లక్ష్మణ్

న్యూఢిల్లీ
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు.  ఉత్తరాఖండ్ లో 70,యూపీలో 98 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించే లక్ష్మణ్ కు భాద్యతను పార్టీ అప్పగించిన విషయం తెలిసిందే. లక్ష్మణ్ మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల్లో బిజెపి అనుకుల పవనాలు ఉన్నాయి. బిజెపికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. బిజెపి చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ఐదు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు రాజకీయాల కోసం బరిలో ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు. యుపిలో మోడీ - యోగి, ఉత్తరాఖండ్ లో మోడీ-పుష్కర్ సింగ్ దామి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో మాఫియా కనపడకుండా చేశారని అన్నారు.
రైతుల మేలు కోసం యోగి ప్రభుత్వం 36 వేల కోట్లు,86 లక్షల మందికి రుణ మాఫీ చేశారు. యుపి రైతులకి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద పెట్టుబడి సాయం అందుతుంది. 43 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు కట్టించారు. 4.5 లక్షల నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 2 కోట్ల మంది కి ప్రైవేట్ ఉద్యోగాలు లభించాయి. విద్యార్థులకు టాబ్ లు ,విద్యార్థినులకు ఉచిత విద్య అందిస్తుందని అన్నారు.
75 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. 25 కోట్లమందికి ఉచిత వ్యాక్సిన్ అందేశారు. ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందుతుంది. మూతబడిన 20 చక్కెర కర్మాగరాలు తెరిచి ఉద్యోగాలు కల్పించాం. అనేక మంది బిజెపి పాలన నచ్చి బీఎస్పీ,ఎస్పీ నేతలు బిజెపిలో చేరుతున్నారు. రామ మందిర నిర్మణం, భవ్య కాశి దివ్య కాశి, భవిష్యత్ లో మధుర అభివృద్ధి బీజేపీతో సాధ్యం కాబోతోంది. ఓబీసీలు,బిసిలకు కేంద్ర కేబినెట్ లో మోడీ ప్రభుత్వం ప్రాతినిధ్యం కల్పించింది. నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. పంజాబ్ లో మెరుగైన స్థానాలు గెలుచుకుంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ పై ఉంటుంది. కాంగ్రెస్ నామ మాత్రపు పార్టీగా తెలంగాణ లో మిగిలిపోతుందని అన్నారు.

Related Posts