YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మహేష్ బ్యాంకు కేసులో పురోగతి

మహేష్ బ్యాంకు కేసులో పురోగతి

హైదరాబాద్, జనవరి 27,
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి హైదరాబాద్ లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సైబర్ దాడిలో మహేష్ బ్యాంకు నుంచి నిందితులు రూ. 12 కోట్లు మాయం చేశారు. ఈ 12 కోట్లను సైబర్ 120 అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు, మహేష్ బ్యాంకు మెయిన్ సర్వర్ పై ఈ దాడి జరిగినట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే మహేష్ బ్యాంక్ సైబర్ అటాక్ కేసులో పురోగతి సాధించామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. బ్యాంకుసరైన సెక్యూరిటీ సిస్టం పెట్టుకోవాల్సి ఉంటుందని, బ్యాంకు నిందితులు ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. సర్వర్ లోకి నేరగాళ్లు ఎక్కడి నుంచి చొరబడ్డారు అనే విషయం తెలుసుకుంటున్నామని, నిందితులు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకు అకౌంట్లో వివరాలను తీస్తున్నామని, ఎక్కడి నుంచి సర్వర్ ను ఆపరేట్ చేశారన్న విషయాన్ని తెలుసుకుంటున్నామన్నారు. త్వరలోనే బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Related Posts