న్యూఢిల్లీ జనవరి 27
సీఎం జగన్‌రెడ్డి రాజ్యాంగం చదువుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తే 200 కేసులను ఓడిపోయేవాళ్లం కాదన్నారు. రాజ్యాంగం ఫాలో కావాలన్నందుకే తనను కొట్టారని తెలిపారు. ఒక ఎంపీ నియోజకవర్గంలో తిరిగే హక్కు కూడా ఏపీలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి జీవోలు అమలు చేసి జిల్లాల విభజన చేపడుతున్నారని తప్పుబట్టారు. పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు అంటున్నారని, అర్ధరాత్రి జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటి? అని రఘురామ ప్రశ్నించారు. కేబినెట్‌లో జిల్లాలపై చర్చ జరగకుండానే.. అర్ధాంతరంగా తీసుకురావాల్సిన అవసరమేంటి? అని రఘురామ ప్రశ్నించారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టకుండా జిల్లాల విభజన చేయాలని రఘురామకృష్ణరాజు సూచించారు.