బెంగళూరు, జనవరి 28,
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులున్నాయి.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే కాదు.. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం.. కాంగ్రెస్‌ను వీడారు.. ఇక, కాంగ్రెస్ పార్టీతో తన సంబంధాలు ముగిశాయని ప్రకటించారు.. అయితే, ఏ పార్టీలో చేరే విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.. ప్రస్తుతం తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తాను స్వతంత్రుడనని చెప్పుకొచ్చారు.కర్ణాటక మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా పేరున్నసీఎం ఇబ్రహీం.. కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ గత ఏడాది కాలంగా పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి.. కానీ, విధానపరిషత్‌లో ప్రతిపక్షనేత హోదా ఖాళీ కావడంతో ఆ స్థానానికి తీవ్ర ప్రయత్నం చేశారాయన.. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం ఆ స్థానాన్ని సీనియర్ నేత బీకే హరిప్రసాద్‌కు అప్పగించేందుకు సిద్ధమైంది.. ఈ మేరకు బుధవారం ఆయన పేరును ఖరారు చేసింది. కానీ, ఆ వెంటనే ఇబ్రహీం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇబ్రహీం.. తనపై సోనియాగాంధీకి అభిమానం తగ్గిందని, అటువంటి చోట కొనసాగినా ప్రయోజనం ఉండబోదని చెప్పుకొచ్చారు.. ఇక, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు బీకే హరిప్రసాద్ పట్ల అభిమానం ఉందని, వారిద్దరిదీ ఒకే మాట అంటూ విమర్శలు గుప్పించారు.. తమనకో మరోసారి అవమానం జరిగింది.. ఇక, తాను కాంగ్రెస్‌లో ఉండేది లేదని తేల్చేశారు.. అయితే.. ఇబ్రహీం.. జేడీఎస్ లో చేరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.