ముంబై, జనవరి 28,
భారతీయ జనతా పార్టీ తో పొత్తు పెట్టుకుని శివసేన 25 ఏళ్లు వృధా చేసిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం పేర్కొన్న విషయం తెలిసిందే. శివసేన అధినేత ఠాక్రే.. తన తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 96వ జయంతిని పురస్కరించుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీని కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే.. తన పూర్వ మిత్రపక్షమైన బీజెపిపై విరుచుకుపడుతూనే.. తన ప్రధాన హిందూత్వ భావజాలాన్ని వదులుకోమని స్పష్టంచేశారు. ప్రత్యర్థి అయిన బిజెపితో తలపడేందుకు.. కాంగ్రెస్ కు ప్రాంతీయ నాయకుల ముందు లొంగిపోయేలా చేసింది.. అయితే ఇది భారతీయ జనతా పార్టీ జాగ్రత్తగా రూపొందించిన కూటమి వ్యూహం.. జాతీయ రాజకీయాల్లో బలాన్ని ఇచ్చిందని వ్యాసకర్త అజయ్ ఝా రాశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అజయ్ ఝా కీలక వ్యాసం రాశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 మరియు మార్చి 7 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పొత్తులు కీలాకాంశంగా మారాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు రాష్ట్రాల్లో విచిత్రమైన పొత్తులు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. అంతేకాకుండా ప్రధాన పార్టీలకు సవాళ్లను సైతం విసురుతున్నాయని అజయ్ ఝా పేర్కొన్నారు.విచిత్రమైన పొత్తులు.. మునుపటి క్రూరత్వ చరిత్రను గుర్తుచేస్తున్నాయి. పోలింగ్ జరిగే అన్ని రాష్ట్రాలలో అధికారాన్ని పంచుకోవాలనే ఏకైక ఉద్దేశ్యంతో పలు పార్టీల నాయకులు కలిసి వస్తున్నారు. అయితే గతంలో ఒకరినొకరు భాగస్వాములుగా భావించిన కొందరు విడిపోతున్నారు. కానీ అరుదుగా 25ఏళ్ల పాటు కొనసాగిన స్నేహం.. ఇటీవలి కాలంలో తెగదెంపులైంది. మూడు పార్టీల సంకీర్ణానికి ముఖ్యమంత్రిగా నాయకత్వం వహిస్తున్న మహారాష్ట్ర పాలక పార్టీ శివసేన అధినేత ఉదవ్ ఠాక్రే వ్యాఖ్యలు ఆలోచించేలా చేశాయని అజయ్ ఝా పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇలా వ్యాఖ్యనించడం బిజెపీతో పొత్తు పెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేను అవమానించడమేనని.. పేర్కొన్నారు. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఉద్ధవ్‌కు బీజేపీ ఎన్నో అవకాశాలను కల్పించింది. తద్వారా 2014 రాష్ట్ర ఎన్నికల నాటికి శివసేన ప్రధాన పార్టీగా అవతరించింది. అలా బీజేపీ-శివసేన రెండు కలిసి ఎక్కువ సీట్లు గెలుచుకున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రంలో బీజేపీ మొదటి ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. 2019 రాష్ట్ర ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ఉదవ్ ఠాక్రే డిమాండ్ చేయడం.. బిజెపి నిరాకరించడం లాంటి పరిస్థితులు చూశాం. ఆతర్వాత కూటమిని రద్దు చేశారు. ఈ క్రమంలో ఠాక్రే.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శివసేన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం కాస్త ఆలోచించాల్సిన విషయం.1996లో శిరోమణి అకాలీదళ్, బిజెపీ కలిసి వచ్చినప్పుడు పంజాబ్‌లో ఇలాంటి కూటమి పుట్టింది. వారు సహజ మిత్రులుగా కూడా కనిపించారు – అకాలీ రాజకీయాలు గురుద్వారాలు-సిక్కుల చుట్టూ తిరుగుతాయి. బిజెపీ హిందువుల పార్టీగా ప్రచారం చేసింది. 2017లో రాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసే వరకు కూటమి బాగా పనిచేసింది. 2019లో బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం నుండి శివసేన, ఆ తర్వాత వ్యవసాయ చట్టాలపై పోరులో అకాలీదళ్ తెగదెంపులు చేసుకుంది. అకాలీలు ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలకు వెళుతున్నారు. అయితే బీజేపీ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్, విడిపోయిన శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)తో చేతులు కలిపింది. శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ చేయలేని పని, పంజాబ్ కూటమిలో బీజేపీ పెద్దన్నగా అవతరించింది. రాష్ట్రంలో బిజెపీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ఈ కూటమి ఇప్పుడు మేలు చేసినా.. చేయకపోయిన.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీ ప్లాన్ రచించింది.బీజేపీ బలాన్ని పెంచుకునేందుకు వ్యూహంతో ప్రాంతీయ పార్టీలతో పొత్తును కొనసాగిస్తోంది. అయితే.. మనుగడ కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాల ముందు సాగిలపడుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెండంకెల సీట్లు దాటడం కూడా కష్టమే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా విఫలయత్నం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్‌తో, పొరుగున ఉన్న బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసి పయనిస్తూ.. వారి ముందు లొంగిపోతోంది. ఫలితంగా బీజేపీ వ్యూహాలతో కాంగ్రెస్ ప్రభావం కూడా తగ్గుతోంది. అయితే.. ముందుచూపు లేకపోవడం కూడా పశ్చిమ బెంగాల్, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ దాదాపు పతనానికి దారితీసింది. ఎందుకంటే అది గతంలో పాలించిన రెండు రాష్ట్రాల్లో తన మిత్రపక్షాలను మారుస్తూ వచ్చింది. ఇలా చేయడం వల్ల పశ్చిమ బెంగాల్‌లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ద్రవిడ మున్నేట్ర కజగం దయతో ప్రస్తుతం తమిళనాడులో అధికారాన్ని పంచుకుంది. అయితే.. బీహార్ ఎన్నికల్లో అనుసరించిన మాదిరిగానే.. బీజేపీ తన మిత్రపక్షాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటోంది. ఇలానే గోవా, పంజాబ్ లలో పొత్తులను నిర్ణయించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన పొరపాట్లను గ్రహించి, తన వ్యూహాన్ని సవరించుకోకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎదురీత తప్పదు