అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఏపీ నేత సోమువీర్రాజు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన సంస్కృతి టీడీపీదన్నారు. ప్రకటనలకు, ముఖ్యమంత్రి వైఖరి పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్నారు. ప్రధానిపై బాలకృష్ణ మాట్లాడిన మాటలకు కూడా చంద్రబాబు నవ్వుతున్నారని పేర్కొన్నారు. బాలకృష్ణపై ఇంత వరకు ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం లేదని ఆరోపించారు. చంద్రబాబు మనకు రక్షణ ఇస్తారని...ముఖ్యమంత్రిని చేస్తే..ఆయన రక్షణ కావాలంటున్నారని... రక్షణ లేని ప్రజలు ఆయనకు ఎందుకు 2019 లో ఓట్లు వేయాలన్నారు. డబుల్ స్టాండ్ మానుకోవాలని చెప్పారు అలిపిరి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఘటనకు కారణమైన కార్యకర్తలపై చర్యలు తీసుకోలేదన్నారు. తప్పు చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం లేదన్నారు. హోదా విషయంలో నిరసన తెలిపే నైతిక హక్కు టీడీపీకి లేదని అయన అన్నారు. టీడీపీ సైకిల్ యాత్ర ఎందుకు ఫెయిల్ అయిందన్నారు. ఇసుక మాఫియాలో చంద్రబాబుకు నెంబర్ వన్ స్థానం వచ్చిందని ఎద్దేవా చేశారు. హోదాపై గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారో ఏం తీర్మానాలు చేశారో అందరికీ తెలుసన్నారు. హోదాతో ప్యాకేజీకి మించిన లాభం జరుగుతుందా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ఏడాది ముందు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. బీజేపీది ఓట్లు, నోట్ల రాజకీయం కాదని అయన అన్నారు.