విజయవాడ
ఫిబ్రవరి 11, 12, తేదీలలో జరగనున్న కొండపల్లి హజరత్ సయ్యద్ షాఋఖారి దర్గా ఉరుసు మహోత్సవానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించి, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అంజాద్ బాషా తెలిపారు. హజరత్ సయ్యద్ షా బుఖారి 2022 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహోన్నత చరిత్ర కలిగి 425 ఉరుసు మహోత్సవానికి ఇతర రాష్ట్రాల నుండి సైతం వచ్చే భక్తులకోసం ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. వేలాదిగా వచ్చే భక్తులకు ప్రతి సంవత్సరం వలే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారన్నారు.కావున ఉరుసు ఉత్సవంలో భక్తులు పాల్గొని మహా మహోన్నతమైన బాబా గారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైయస్సార్ సిపి మైనార్టీ నాయకులు మీర్ హుస్సేన్ రాష్ట్ర వై ఎస్ ఆర్ సి పి మైనార్టీ సంయుక్త కార్యదర్శి రఫీ, జి ఎం సి బాబు, సర్తాజ్, కత్తురాజు రామకృష్ణ, శ్రీను, భాషా తదితరులు పాల్గొన్నారు.