YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

మరో కొత్త వైరస్‘నియోకోవ్’

మరో కొత్త వైరస్‘నియోకోవ్’

న్యూ ఢిల్లీ జనవరి 28
ఇప్పటికే మూడో వేవ్ (ఒమిక్రాన్) వైరస్ తో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు తాజాగా మరో గుదిబండ తయారైంది. దీనితో ఇంకొన్నాళ్ల పాటు కరోనా ఊభి నుంచి ఎవరూ తప్పించుకోలేరు అన్నట్లుగా తయారైంది పరిస్థితి.. దక్షిణాఫ్రికాలో ‘నియోకోవ్’ అనే కొత్త వైరస్ ను కనుగొన్నారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మరణాలు కూడా అధికంగానే ఉంటాయని వూహాన్ లోని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచం మొత్తం మరోసారి భయాందోళనలో మునిగింది. కాగా నియోకోవ్ ను గబ్బిలాల్లో గుర్తించారని ఇది కూడా కరోనా వైరసేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచాన్ని ఇప్పటికే కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఇప్పటి 2019 లో మొదలైన ఈ మహమ్మారి మూడు వేవ్ లతో ఎంతో మంది ప్రాణాలను హరించింది. ప్రస్తుతం థర్డ్ వేవ్ తీవ్రత అక్కడక్కడా తగ్గిందని కొందరు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో మరో కొత్త వైరస్ బయటపడిందని చైనా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చైనాలోని వూహాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్ తన కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం ఇది ఒక జంతువు నుంచి మరో జంతువుకు సోకుంతుందనితెలిపారు. అయితే ఇది ఎలా రూపాంతరం చెందిందని ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. ఇందులోని మ్యూటేషన్ కారణంగా నియోకోవ్ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వూహాన్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.  గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ప్రశావవంతంగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే మనుషుల్లో ఏసీఈ2 ను ఏ మార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం ఉన్నట్లు తెలిపారు.  వూహాన్ యూనివర్సిటీ బయోఫిజిక్స్ ఆఫ్ ది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన శాస్త్రవేత్తలలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని శాస్త్రవేత్లు పేర్కొంటున్నారు. కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు వచ్చిన వేవ్ లతో పోలిస్తే ఇది ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. యాంటిబాడీలు కొవిడ్ 19 వ్యాక్సిన్లు కూడా దీనికి పనిచేయకపోవచ్చని  పేర్కొంటున్నారు. 2012-2015లలో  విజృంభించిన మెర్స్ మాదిరిగానే నియోకోవ్ ఉంటుందని అంటున్నారు. ఈ వైరస్ మునుషులకు సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని అంటున్నారు. నియోకోవ్ వైరస్ ను మొదట  దక్షిణాఫ్రికాలో కనుగొనగా ఇది జంతువుల నుంచి మనుషులకు సోకిందని వీటిపై వూహాన్ శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. 

Related Posts